News January 21, 2025

కడప: హత్యాయత్నం కేసులో 12 మందికి జైలు శిక్ష

image

వీరపునాయునిపల్లె మండలంలో 2014లో గుమ్మిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో 12 మందిపై నేరం రుజువైంది. దీంతో ప్రొద్దుటూరు కోర్టు ముద్దాయిలకు మూడేళ్ల సాధారణ జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.35వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్ఐ మంజునాథ్ తెలిపారు. అప్పటి ఎస్ఐ రోషన్ కేసు నమోదు చేయగా.. నేరం రుజువు కావడంతో సోమవారం కోర్టు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

Similar News

News March 7, 2026

కడప: ‘10th పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి’

image

కడప జిల్లాలో 10th పరీక్షలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జేసీ నిధిమీనా పరీక్షల నిర్వాహక అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సభా భవన్‌లో పది పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 169 సెంటర్లలో 28,158 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్జేడీ శామ్యూల్, ఏసీ , డీఈఓ శంషుద్దీన్ హాజరయ్యారు.

News March 7, 2026

కమలాపురం వద్ద టిప్పర్- బైక్ ఢీ.. ఒకరు మృతి

image

కడప-తాడిపత్రి జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కమలాపురం మండలం రామచంద్రపురం పరిధిలో టిప్పర్ స్కూటర్‌ను ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి జంగంపల్లికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డిగా స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 7, 2026

కడప: ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 5,411 మంది విద్యార్థులు హాజరు.!

image

కడప జిల్లాలో శనివారం 34 కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షలు జరిగాయి. నేడు జరిగిన కెమిస్ట్రీ, ఎకనామిక్స్ పరీక్షలకు 5,411 మంది విద్యార్థులు హాజరయ్యారు. కెమిస్ట్రీ పరీక్షలు 3,764 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా.. 3,383 మంది రాశారు. 381 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఎకనామిక్స్ పరీక్షలు 2,257 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా.. 2,028 మంది హాజరయ్యారు. అయితే 229 మంది గైర్హాజరయ్యారు.