News January 21, 2025

Stock Markets: రేంజుబౌండ్లో కొనసాగొచ్చు..

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు రేంజుబౌండ్లో చలించొచ్చు. సూచీలు ఊగిసలాడే అవకాశం కనిపిస్తోంది. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందుతున్నాయి. ఆరంభంలో లాభపడిన గిఫ్ట్ నిఫ్టీ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. డాలర్ ఇండెక్స్, ట్రెజరీ యీల్డులు బలపడ్డాయి. క్రూడాయిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. USDINR బలహీనత కొనసాగుతోంది. బంగారం ధర పెరిగింది. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండటమే మేలని నిపుణులు సూచిస్తున్నారు.

Similar News

News January 21, 2025

PHOTOS: ఫ్యామిలీతో అల్లు అర్జున్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో దిగిన కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. భార్య స్నేహా రెడ్డితో పాటు కొడుకు అయాన్, కూతురు అర్హ వైట్ టీషర్టు ధరించి కెమెరాలకు పోజులిచ్చారు. మొన్నటి వరకు ‘పుష్ప-2’ సినిమా కోసం హెయిర్, బియర్డ్ పెంచిన బన్నీ.. తాజాగా తన లుక్‌ను మార్చేసిన విషయం తెలిసిందే. కాగా, మార్చి నెల నుంచి త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబోలో సినిమా ప్రారంభం కానుంది.

News January 21, 2025

భారత్‌తో తొలి T20.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన

image

భారత్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రేపు జరిగే తొలి T20 కోసం ఇంగ్లండ్ జట్టును ప్రకటించింది. బట్లర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, సాల్ట్(కీపర్), డక్కెట్, బ్రూక్, లివింగ్ స్టోన్, బెథెల్, ఓవర్టన్, అట్కీన్‌సన్, అర్చర్, రషీద్, వుడ్ జట్టులో ఉండనున్నారు. ఈ మేరకు జట్టును కోచ్ మెక్‌కల్లమ్ ప్రకటించారు.

News January 21, 2025

రేపటి నుంచి INDvsENG టీ20 సిరీస్

image

భారత్, ఇంగ్లండ్ మధ్య రేపటి నుంచి 5 మ్యాచుల టీ20 సిరీస్ జరగనుంది. రేపు తొలి మ్యాచ్ కోల్‌కతా వేదికగా రా.7 గంటలకు ప్రారంభం అవుతుంది. స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్, హాట్ స్టార్ యాప్‌లో లైవ్ చూడవచ్చు. తర్వాతి మ్యాచులు ఈనెల 25 (చెన్నై), 28 (రాజ్‌కోట్), 31 (పుణే), ఫిబ్రవరి 2(ముంబై) తేదీల్లో జరగనున్నాయి. 3 మ్యాచుల వన్డే సిరీస్ (నాగ్‌పూర్, కటక్, అహ్మదాబాద్) FEB 6 నుంచి జరగనుంది.