News January 21, 2025
ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

తెలంగాణలో ఇంటర్ కాలేజీల్లో <<15028933>>మధ్యాహ్న భోజన పథకం<<>> అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. CM రేవంత్ సూచనలతో ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం అంగీకారం తెలిపితే 2025-26 విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందించనుంది. రాబోయే బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశం ఉంది. రాష్ట్రంలో 425 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా, సుమారుగా 1.75 లక్షల మంది చదువుతున్నారు.
Similar News
News November 12, 2025
స్లీపర్ సెల్స్ రూపంలో టెర్రరిజం: కిరణ్ బేడీ

పేదరికం, నిరుద్యోగంతో యువత ఉగ్ర, తీవ్రవాదాల వైపు మళ్లుతున్నారన్నది పాత వాదన. కానీ అదిప్పుడు వైట్ కాలర్ అఫెన్సుగా మారింది. తాజాగా పట్టుబడ్డవారంతా డాక్టర్లు, ప్రొఫెసర్లే. సరిహద్దుల్ని దాటి దేశంలో స్లీపర్ సెల్స్ రూపంలో టెర్రరిజమ్ వ్యాపించిందని మాజీ IPS కిరణ్ బేడీ ఇండియాటుడే చర్చలో పేర్కొన్నారు. ఇది ప్రమాదకరమని, ప్రజల సహకారంతో అన్ని రాష్ట్రాల భద్రతా విభాగాలు ఉగ్రవాదాన్ని పూర్తిగా తుదముట్టించాలన్నారు.
News November 12, 2025
‘తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సవరించేలా చూడండి’

AP: మొంథా తుఫాన్ నష్టంపై వేగంగా నివేదిక ఇచ్చి.. రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాలని కేంద్ర బృందాన్ని సీఎం చంద్రబాబు కోరారు. తుఫాన్ వల్ల రూ.6,384 కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణ సాయంగా రూ.2,622 కోట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్రం బృందం CMతో సమావేశమైంది. తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సవరించేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని బృంద సభ్యులను సీఎం కోరారు.
News November 12, 2025
SBIలో మేనేజర్ పోస్టులు

<


