News January 21, 2025
సోలార్ సెల్ ప్లాంట్‌ను ఏపీలో పెట్టండి: లక్ష్మీ మిట్టల్‌తో మంత్రి లోకేశ్
AP: దావోస్‌లోని బెల్వేడార్‌లో మిట్టల్ గ్రూప్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్‌తో CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. భావనపాడును పెట్రోకెమికల్ హబ్‌గా మార్చడానికి పెట్టుబడులు పెట్టాలని మంత్రి కోరారు. పెట్రో కెమికల్స్, గ్రీన్ ఎనర్జీలో నూతన ఆవిష్కరణలకు అవకాశాలు ఉన్నాయని వివరించారు. రూ.3,500 కోట్లతో భారత్‌లో ఏర్పాటు చేయాలనుకుంటున్న 2GW సామర్థ్యం గల సోలార్ సెల్ తయారీ ప్లాంట్‌ను ఏపీలో నెలకొల్పాలని కోరారు.
Similar News
News January 21, 2025
ట్రంప్ గారూ.. మరోసారి ఆలోచించండి: WHO
WHO నుంచి <<15210852>>తప్పుకుంటున్నట్లు<<>> ట్రంప్ ప్రకటించడంపై ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ స్పందించారు. ట్రంప్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు. కోట్లాది మంది ఆరోగ్యం కోసం WHO, USA కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా 1.4 బిలియన్ల జనాభా ఉన్న చైనా WHOకు 39 మిలియన్ డాలర్లు చెల్లిస్తుంటే తాము 500 మి.డా. చెల్లిస్తున్నామని ట్రంప్ అంతకుముందు చెప్పారు.
News January 21, 2025
IT దాడులపై స్పందించిన దిల్ రాజు భార్య
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు చేస్తోంది. దీనిపై ఆయన భార్య తేజస్విని స్పందించారు. ‘సినిమా నిర్మాణాలకు సంబంధించే మా ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఇంట్లో ఉన్న పలు రికార్డులు పరిశీలించారు. ఐటీ అధికారులకు బ్యాంకు వివరాలు ఇచ్చాం. బ్యాంకు లాకర్లను కూడా ఓపెన్ చేసి చూపించాం. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఆమె పేర్కొన్నారు.
News January 21, 2025
డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ స్పందించొద్దు: జనసేన
AP: మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి అంశంపై ఎవరూ స్పందించవద్దని జనసైనికులకు జనసేన పార్టీ ఆదేశించింది. మీడియా ముందు కానీ, సోషల్ మీడియాలో కానీ దీనిపై ఎవరూ మాట్లాడవద్దని సూచించింది. కాగా ఇదే అంశంపై నిన్న టీడీపీ అధిష్ఠానం కూడా తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎవరూ బహిరంగ ప్రకటనలు చేయవద్దని సూచించింది.