News March 18, 2024
కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది: శివ్‌రాజ్‌సింగ్

కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందని మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి బదులు రాజ్యసభ రూట్‌ను ఎంచుకున్నారు. ఆ పార్టీకి పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలవనుంది. రాహుల్ గాంధీకి ఎప్పుడేం చేయాలో తెలీదు. ఎన్నికల సమయంలో యాత్రలు చేస్తుంటారు’ అని విమర్శించారు.
Similar News
News April 1, 2025
రైల్ రోకో కేసు కొట్టేయండి.. హైకోర్టుకు కేసీఆర్

TG: 2011, అక్టోబరు 15న సికింద్రాబాద్‌లో నిర్వహించిన రైల్ రోకోకు సంబంధించి తనపై నమోదైన కేసును కొట్టేయాలని BRS అధినేత KCR హైకోర్టును కోరారు. KCR పిలుపు మేరకే రోకో జరిగినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించగా, ఘటన సమయంలో ఆయన అక్కడ లేరని కేసీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. వాదనలు ఆలకించిన ధర్మాసనం.. ఫిర్యాదు చేసిన వ్యక్తికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
News April 1, 2025
ఆటో ఛార్జీకి రూ.30 అడిగేవాడు.. కానీ ఇప్పుడు: హర్కేశ్

నిన్న KKRపై డెబ్యూ మ్యాచ్‌లోనే అశ్వనీకుమార్(MI) 4 వికెట్లు తీయడంతో తండ్రి హర్కేశ్ ఉప్పొంగిపోతున్నారు. అతను బుమ్రా, స్టార్క్‌లా రాణించాలని కలలు కనేవాడని చెప్పారు. ట్రైనింగ్ ముగించుకుని రా.10కి ఇంటికొచ్చి ఉ.6కే అకాడమీకి సైకిల్‌పై వెళ్లేవాడని గుర్తుచేసుకున్నారు. ఒక్కోసారి ఆటోలో వెళ్లేందుకు ₹30 అడిగేవాడని, ఇప్పుడు వేలంలో ₹30L సాధించాడని తెలిపారు. దాంతో పలువురికి క్రికెట్ కిట్లు విరాళంగా ఇచ్చారన్నారు.
News April 1, 2025
తెలంగాణ కాంగ్రెస్ ఫ్లెక్సీలో YS జగన్ ఫొటో

TG: నల్గొండలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఫొటోను ముద్రించడం చర్చనీయాంశంగా మారింది. సన్నబియ్యం పంపిణీకి వస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్వాగతం పలుకుతూ దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీని ప్రజలు ఆసక్తిగా తిలకించారు.