News January 21, 2025
కడప SPగా నార్పల గ్రామ వాసి

కడప జిల్లా ఎస్పీగా ఈజీ అశోక్ కుమార్‌ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఆయన స్వగ్రామం అనంతపురం జిల్లా నార్పల గ్రామం. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ 2010లో డీఎస్పీగా విధుల్లో చేరారు. నాగర్ కర్నూల్, చింతలపల్లె, కడపలో డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. 2018లో ఏఎస్పీగా ఇంటలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న క్రమంలో ప్రమోషన్‌పై ఇటీవల ఎస్పీగా పదోన్నతి రావడంతో మొదటి పోస్టింగ్ కడపకు ఇచ్చారు.
Similar News
News January 11, 2026
రేపు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో ఈనెల 12న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News January 11, 2026
అనంత: పండుగ ముంగిట విషాదాంతం

పండుగ పూట పలు కుటుంబాల్లో విషాదం నిండింది. కూడేరు(M) జల్లిపల్లికి చెందిన ఉదయ్ కిరణ్(12) ఆటోలో ఆడుకుంటుండగా ఇంజిన్ స్టార్ట్ అయ్యింది. ముందుకెళ్లి బోల్తాపడి బాలుడు మృతిచెందాడు. బ్రహ్మసముద్రం(M) పోలేపల్లి వద్ద BTP కాలువలోకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో నీటిలో ఊపిరాడక కపటలింగనపల్లికి చెందిన నితిన్(15) మరణించాడు. అనంతపురం పోలీస్ కంట్రోల్ రూములో ఎస్సైగా పనిచేస్తున్న మోహన్ ప్రసాద్(61) గుండెపోటుతో మృతిచెందారు.
News January 9, 2026
అనంత జిల్లా ప్రజలకు అదిరిపోయే న్యూస్

సంక్రాంతి పండుగ సందర్భంగా అనంతపురం జిల్లా ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులు నడిపేందుకు నిర్ణయించింది. హైదరాబాద్, చెన్నై, విజయవాడ, బెంగళూరు వంటి దూర ప్రాంతాలకైనా సాధారణ ఛార్జీలే ఉంటాయని పేర్కొంది. పండుగకు ముందు 39, తర్వాత 38 బస్సులు వివిధ ప్రాంతాలకు నడపనుంది. ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి.


