News March 18, 2024
గాజాలో దాడులు ఆపేదే లేదు: నెతన్యాహు
గాజాపై దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ‘అంతర్జాతీయ ఒత్తిళ్లకు మేం తలొగ్గం. యుద్ధంలో మా లక్ష్యాన్ని మధ్యలోనే ఆపలేం. గాజాపై దాడుల విషయంలో ప్రపంచ దేశాల ఒత్తిడిని పట్టించుకోం. మరికొన్ని వారాలపాటు దాడులు కొనసాగిస్తాం. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన భీకర దాడులు అందరూ మర్చిపోవచ్చు. కానీ మేం అంత త్వరగా మర్చిపోం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 27, 2024
Stock Market: గ్రీన్‌లో ముగిశాయి
దేశీయ స్టాక్ మార్కెట్లు Friday లాభాలతో ముగిశాయి. Sensex 78,699 (+226) వద్ద, Nifty 87 పాయింట్లు ఎగసి 23,837 వద్ద స్థిరపడ్డాయి. ఫార్మా 1.30%, ఆటో 0.97%, హెల్త్‌కేర్ 0.80% లాభపడడంతో సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో సెషన్ ప్రారంభంలో గంటపాటు ర్యాలీ జరిగినా Sensexలో 79,000 వద్ద, Niftyలో 23,900 వద్ద బలమైన Resistance ఉండడంతో సూచీలు రివర్సల్ తీసుకున్నాయి.
News December 27, 2024
దేశానికి అవిశ్రాంతంగా సేవలందించిన గొప్ప నేత: చంద్రబాబు
దూరదృష్టితో దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. ఢిల్లీలో ఆయన పార్థివదేహానికి నివాళి అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సింగ్ మరణం బాధాకరమని, ఆయన దేశానికి అవిశ్రాంతంగా సేవలందించారని గుర్తు చేసుకున్నారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపట్లో ఆయన మన్మోహన్ భౌతికకాయానికి నివాళి అర్పించనున్నారు.
News December 27, 2024
సచిన్ టెండూల్కర్‌కు అరుదైన అవకాశం
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు అరుదైన అవకాశం లభించింది. ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్(MCC)లో గౌరవ సభ్యునిగా సచిన్‌కు చోటు దక్కింది. తమ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారని MCC ట్వీట్ చేసింది. క్రికెట్‌కు అత్యుత్తమ సేవలు అందించిన సచిన్ MCCలో భాగమైనందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. టెండూల్కర్ MCGలో 5 టెస్టులు ఆడగా 58.69 స్ట్రైక్ రేట్‌తో 449 పరుగులు చేశారు.