News January 21, 2025
ఇచ్చిన మాట ప్రకారం నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: పొన్నం
సిరిసిల్ల చేనేత కార్మికులకు ప్రజా పాలన ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం స్వయం సహాయక సంఘాలకు అందించే యూనిఫాం చీరల ఆర్డర్ ఇచ్చి పెద్ద ఎత్తున పని కల్పించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు అందించే ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా అందరికీ ఒకే రంగు గల ఒక్కొకరికి ఒక్కో చీరను అందజేసేందుకు 4.24 కోట్ల మీటర్ల చీరల ఆర్డర్స్ అందజేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 22, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.1,38,986 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.94,801, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.37,180, అన్నదానం రూ.7,005, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
News January 22, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన గ్రామ, వార్డు సభలు. @ వెల్గటూర్ మండలంలో కారు, బైక్ డీ.. ఒకరికి తీవ్ర గాయాలు. @ చొప్పదండిలో షార్ట్ సర్క్యూట్ తో 30 క్వింటాల్ల పత్తి దగ్ధం. @ కోనరావుపేట మండలంలో హనుమాన్ చాలీసా పారాయణం. @ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రులు. @ రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్న మంత్రులు ఉత్తమ్, పొన్నం.
News January 21, 2025
సూరమ్మ ప్రాజెక్టును పరిశీలించిన ప్రభుత్వ విప్, సిరిసిల్ల కలెక్టర్
కథలాపూర్ మండలం కలిగోట గ్రామశివారులో నిర్మిస్తున్న సూరమ్మ ప్రాజెక్టును మంగళవారం సాయంత్రం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా పరిశీలించారు. బుధవారం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సూరమ్మ ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో ముందస్తుగా ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు.