News January 21, 2025
-800 నుంచి +70 వరకు పుంజుకున్న సెన్సెక్స్

దేశీయ స్టాక్‌మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నాయి. ఇన్వెస్టర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఒకానొక దశలో 800pts పతనమైన సెన్సెక్స్ 77,337 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. కాసేపటికే పుంజుకొని 70pts లాభంతో 77,141 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు 150pts తగ్గిన నిఫ్టీ 23,426 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఇప్పుడు 30pts పెరిగి 23,376 వద్ద చలిస్తోంది. ట్రంప్ టారిఫ్స్, అంతర్జాతీయ పరిస్థితులే ఇందుకు కారణాలు.
Similar News
News November 8, 2025
యుద్ధానికి సిద్ధం.. పాక్‌కు అఫ్గాన్ వార్నింగ్

పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ మధ్య మరోసారి చర్చలు విఫలం అయ్యాయి. తుర్కియే, ఖతర్ మధ్యవర్తిత్వంలో ఇవాళ ఇస్తాంబుల్‌లో జరిగిన శాంతి చర్చలు పురోగతి లేకుండానే ముగిశాయి. పాకిస్థాన్ కారణంగానే ఈ సందిగ్ధత ఏర్పడిందని అఫ్గాన్ ఆరోపించింది. అవసరమైతే తాము యుద్ధానికైనా సిద్ధమని పాక్‌ను తాలిబన్ సర్కార్ హెచ్చరించింది. ఇక నాలుగో విడత చర్చలకు ఎలాంటి ప్రణాళికలు లేవని పాక్ ప్రకటించింది.
News November 8, 2025
కవ్వాల్ రిజర్వ్ ఫారెస్టులో జియోకు 2 ఎకరాలు

TG: కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టులో రిలయన్స్ కంపెనీ జియో డిజిటల్ ఫైబర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు దాదాపు 2 ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వం కేటాయించింది. మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్లో ఈ భూమిని ఇచ్చారు. ఆ సంస్థ ఈ భూమిలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయనుంది. ప్రభుత్వం కొన్ని షరతులతో జీఓ విడుదల చేసింది. కేంద్ర అటవీ నిబంధనలకు లోబడి ఈ భూమిని కేటాయిస్తున్నట్లు వెల్లడించింది.
News November 8, 2025
ALERT: డిజిటల్ గోల్డ్ కొంటున్నారా?

డిజిటల్, ఆన్‌లైన్ గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టేవారు అప్రమత్తంగా ఉండాలని సెబీ హెచ్చరించింది. ఈ విధానం తమ పరిధిలోకి రాదని, మోసాలకు తాము బాధ్యత వహించలేమని స్పష్టం చేసింది. వాటిలో కౌంటర్ పార్టీ, ఆపరేషనల్ రిస్కులు ఉంటాయని పేర్కొంది. దీని వల్ల పెట్టుబడిదారులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపింది. ETF, EGRsలే తమ పరిధిలోకి వస్తాయని, వాటి ద్వారా గోల్డ్ కొనుగోలు చేయడం సురక్షితమని వెల్లడించింది.


