News January 21, 2025
అధైర్య పడవద్దు.. అందరికీ సంక్షేమ పథకాలు: కలెక్టర్

ఎవరు అధైర్య పడకూడదని అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేస్తామని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. ధరూర్ మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. గ్రామీణ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రణాళిక ప్రకారం గ్రామసభలు నిర్వహించి, అర్హులకు పథకాలు వర్తింప చేస్తామన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు.
Similar News
News September 14, 2025
జానంపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మూసాపేట మండలంలోని జానంపేటలో 51.5 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. బాలానగర్ 50.5, భూత్పూర్ 12.8, మహబూబ్ నగర్ గ్రామీణం 12.3, దేవరకద్ర 11.8, రాజాపూర్ 7.8, నవాబుపేట 6.8, హన్వాడ 6.3, జడ్చర్ల 5.0 మిల్లీ మీటర్లు వర్షం పడింది.
News September 14, 2025
MBNR: జాతీయ లోక్ అదాలత్..2,597 కేసులు పరిష్కారం

జాతీయ మెగా లోక్ అదాలత్‌లో మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 2,597 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ఎస్పీ డి.జానకి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. 15 రోజులుగా పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది కేసుల్లో ఉన్న కక్షిదారులను స్వయంగా కలిసినందువల్ల రాజీ మార్గం అవగాహన కలిగించి, లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలకూ ‘మీ ఇంటికే సత్వర న్యాయం’ జరిగిందని, మానిటరింగ్ చేసిన చేసినవారికి త్వరలో రివార్డు అందజేస్తామన్నారు.
News September 14, 2025
MBNR: ఉపాధ్యాయుడి అరెస్ట్.. జైలుకు తరలింపు

విద్యార్థిని లైంగికంగా వేధించిన ఓ ఉపాధ్యాయుని పోలీసులు శనివారం అరెస్టు చేసి జైలుకు పంపించారు. పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పదో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నీ చదువుకు కావలసిన డబ్బంతా నేను ఖర్చు పెడతానని విద్యార్థినితో పదేపదే అనడంతో.. ఆ విద్యార్థి పేరేంట్స్‌కి చెప్పింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.