News January 21, 2025

ముగిసిన KRMB సమావేశం

image

TG: హైదరాబాద్‌ జలసౌధలో జరిగిన KRMB (కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు) సమావేశం ముగిసింది. ఇందులో ప్రధానంగా ఏపీ, తెలంగాణ మధ్య నీటి వాటా, బడ్జెట్ కేటాయింపు, బోర్డు నిర్వహణ, టెలి మెట్రిక్ స్టేషన్ల ఏర్పాటుపై చర్చించారు. ఈ భేటీలో బోర్డు ఛైర్మన్ అతుల్ జైన్‌తోపాటు TG నీటిపారుదలశాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, ఈఎన్సీ అనిల్ కుమార్, AP ENC వెంకటేశ్వరరావు, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.

Similar News

News January 22, 2025

వైస్ ప్రెసిడెంట్‌గా ఉషను ఎంపిక చేయాల్సింది: ట్రంప్

image

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన సందర్భంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య, భారత సంతతి మహిళ ఉషపై ప్రశంసలు కురిపించారు. ఆమె చాలా తెలివైందని, ఉపాధ్యక్ష పదవికి ఉషనే ఎంపిక చేయాల్సింది కానీ వారసత్వం సరికాదు కాబట్టి జేడీని తీసుకున్నా’ అని వ్యాఖ్యానించారు. ఇక జేడీ గొప్ప సెనెటర్ అని, అందుకే ఆయనకు ఓహియో బాధ్యతలు అప్పగించినట్లు ట్రంప్ తెలిపారు.

News January 22, 2025

స్కూళ్లకు గుడ్‌న్యూస్

image

APలోని స్కూళ్లల్లో రూ.1450 కోట్లతో కంప్యూటర్ ల్యాబ్‌లు, గ్రౌండ్స్ అభివృద్ధి చేస్తామని గురుకుల స్కూళ్ల కార్యదర్శి మస్తానయ్య తెలిపారు. 2026 నాటికి 855 స్కూళ్లలో ఆధునిక వసతులు కల్పిస్తామన్నారు. చిత్తూరు జిల్లా కలికిరి, పీలేరు గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. గురుకులాల పరిధిలో 50 స్కూళ్లు, 10 జూనియర్, ఒక డిగ్రీ కాలేజీ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

News January 22, 2025

‘సెంచరీ’ కొట్టేందుకు షార్ సన్నద్ధం

image

AP: శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) వందో ప్రయోగం చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నెలాఖరులో ఇస్రో ఇక్కడి నుంచి GSLV- F15 ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనుంది. ఇప్పటికే షార్‌లోని రెండో ప్రయోగ వేదిక వద్ద ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రయోగానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వందో ప్రయోగం అరుదైన మైలురాయి కావడంతో PM మోదీ హాజరవుతారని సమాచారం.