News January 21, 2025

ట్రంప్ గారూ.. మరోసారి ఆలోచించండి: WHO

image

WHO నుంచి <<15210852>>తప్పుకుంటున్నట్లు<<>> ట్రంప్ ప్రకటించడంపై ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ స్పందించారు. ట్రంప్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు. కోట్లాది మంది ఆరోగ్యం కోసం WHO, USA కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా 1.4 బిలియన్ల జనాభా ఉన్న చైనా WHOకు 39 మిలియన్ డాలర్లు చెల్లిస్తుంటే తాము 500 మి.డా. చెల్లిస్తున్నామని ట్రంప్ అంతకుముందు చెప్పారు.

Similar News

News January 9, 2026

మహిళలూ.. ఈ లక్షణాలున్నాయా? జాగ్రత్త

image

క్యాన్సర్ లక్షణాలు అన్నిసార్లూ బయటకు కనిపించవు. ముఖ్యంగా మహిళల్లో కొన్ని క్యాన్సర్లు నిశ్శబ్ధంగా శరీరంలో వ్యాపిస్తాయంటున్నారు నిపుణులు. చాలా క్యాన్సర్లను ప్రారంభదశలో గుర్తించడం కష్టమని చెబుతున్నారు. అందుకే మహిళల్లో అసాధారణ వాపు, దీర్ఘకాల అలసట, కారణం లేకుండా బరువు తగ్గడం, చర్మంపై మార్పులు, అసాధారణ రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

News January 9, 2026

AIIMS పట్నాలో 117 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

AIIMS పట్నాలో 117 సీనియర్ రెసిడెంట్(నాన్ అకడమిక్) పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBBS/MD/MS/DNB/DM/M.Ch ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://api.aiimspatna.edu.in/

News January 9, 2026

మాయదారి మాంజా.. బాలుడి మెడకు 16 కుట్లు

image

TG: సంక్రాంతి వేళ మాయదారి మాంజా పలువురి ఇళ్లలో విషాదం నింపుతోంది. ఇటీవల HYD శివారు కీసరలో చైనా మాంజా మెడకు తగిలి జశ్వంత్ అనే యువకుడికి 19 కుట్లు పడ్డాయి. తాజాగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లి దుబ్బవాడలో నాలుగేళ్ల చిన్నారి శ్రీహాన్‌కు తీవ్ర గాయమైంది. మాంజా దారం అతడి మెడను కోసేసింది. దీంతో వైద్యులు 16 కుట్లు వేశారు.
** మాంజా వాడకండి.. ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టకండి