News January 21, 2025

నుమాయిష్‌లో ఉచిత పార్కింగ్ ఇవ్వాలి: రాజాసింగ్

image

HYD నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏటా నిర్వహిస్తున్న నుమాయిష్‌ను నగర శివార్లకు తరలించాలని CM రేవంత్ రెడ్డిని BJP MLA రాజాసింగ్ కోరారు. నగరం మధ్యలో జరుగుతున్న ఎగ్జిబిషన్‌కు వేలాదిగా ప్రజలు తరలిరావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోందని, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందన్నారు. మరోవైపు పార్కింగ్ పేరుతో దోచుకుంటున్నారని, ప్రభుత్వ స్థలంలో జరుగుతున్న ఎగ్జిబిషన్‌కు ఉచితంగా పార్కింగ్ కల్పించాలని కోరారు.

Similar News

News January 22, 2025

భారత్ ఫోర్జ్ ప్రతినిధులతో లోకేశ్ భేటీ

image

AP: దావోస్ పర్యటనలో భాగంగా భారత్ ఫోర్జ్ సంస్థ వైస్ ఛైర్మన్ కళ్యాణితో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. APలో రక్షణ పరికరాల తయారీ త్వరగా ప్రారంభించాలని కోరారు. R&D శిక్షణ కేంద్రం, రక్షణ పరికరాల తయారీ కోర్సులు, ITIలలో స్కిల్ డెవలప్‌మెంట్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మడకశిర పరిధిలో రూ.2400 కోట్లతో రక్షణ పరికరాల యూనిట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు భారత్ ఫోర్జ్ ప్రతినిధులు లోకేశ్‌కు బదులిచ్చారు.

News January 22, 2025

రెండో రోజు ఐటీ రైడ్స్

image

హైదరాబాద్‌లోని చిత్ర నిర్మాణ సంస్థలపై రెండో రోజు ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. SVC నిర్మాణ సంస్థ యజమానులు దిల్ రాజు, శిరీష్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన పుష్ప-2, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల కలెక్షన్ల నేపథ్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. ప్రకటించిన కలెక్షన్లకు కడుతున్న ఆదాయ పన్నుకు మధ్య తేడాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

News January 22, 2025

వైస్ ప్రెసిడెంట్‌గా ఉషను ఎంపిక చేయాల్సింది: ట్రంప్

image

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన సందర్భంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య, భారత సంతతి మహిళ ఉషపై ప్రశంసలు కురిపించారు. ఆమె చాలా తెలివైందని, ఉపాధ్యక్ష పదవికి ఉషనే ఎంపిక చేయాల్సింది కానీ వారసత్వం సరికాదు కాబట్టి జేడీని తీసుకున్నా’ అని వ్యాఖ్యానించారు. ఇక జేడీ గొప్ప సెనెటర్ అని, అందుకే ఆయనకు ఓహియో బాధ్యతలు అప్పగించినట్లు ట్రంప్ తెలిపారు.