News January 21, 2025
గ్రూప్-1 మెయిన్స్ డేట్స్ ఖరారు
AP: గ్రూప్-1 షెడ్యూల్‌ను APPSC ఖరారు చేసింది. మే 3 నుంచి 9వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని ప్రకటించింది. ఈ ఏడాది మే 3న తెలుగు, 4న ఇంగ్లిష్, 5న పేపర్1 జనరల్ ఎస్సే, 6న పేపర్2 హిస్టరీ, కల్చరల్, 7న పేపర్3 పాలిటీ, లా, 8న పేపర్4 ఎకానమీ, 9న పేపర్5 సైన్స్, టెక్నాలజీ ఎగ్జామ్స్ జరుగుతాయని వివరించింది. పరీక్షలన్నీ ఉ.10 గం. నుంచి మ.1 గంట వరకు జరుగుతాయని పేర్కొంది.
Similar News
News January 22, 2025
ట్రంప్ మరో సంచలన నిర్ణయం
US అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ సిబ్బందిని సెలవుపై వెళ్లిపోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. త్వరలోనే వారందరికీ లేఆఫ్‌లు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా అధికారంలోకి రాగానే జన్మత: పౌరసత్వం, WHO నుంచి USA ఎగ్జిట్, దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ వంటి నిర్ణయాలతో ట్రంప్ అందరినీ ఆశ్చర్యపరిచారు.
News January 22, 2025
భారత్ ఫోర్జ్ ప్రతినిధులతో లోకేశ్ భేటీ
AP: దావోస్ పర్యటనలో భాగంగా భారత్ ఫోర్జ్ సంస్థ వైస్ ఛైర్మన్ కళ్యాణితో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. APలో రక్షణ పరికరాల తయారీ త్వరగా ప్రారంభించాలని కోరారు. R&D శిక్షణ కేంద్రం, రక్షణ పరికరాల తయారీ కోర్సులు, ITIలలో స్కిల్ డెవలప్‌మెంట్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మడకశిర పరిధిలో రూ.2400 కోట్లతో రక్షణ పరికరాల యూనిట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు భారత్ ఫోర్జ్ ప్రతినిధులు లోకేశ్‌కు బదులిచ్చారు.
News January 22, 2025
రెండో రోజు ఐటీ రైడ్స్
హైదరాబాద్‌లోని చిత్ర నిర్మాణ సంస్థలపై రెండో రోజు ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. SVC నిర్మాణ సంస్థ యజమానులు దిల్ రాజు, శిరీష్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన పుష్ప-2, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల కలెక్షన్ల నేపథ్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. ప్రకటించిన కలెక్షన్లకు కడుతున్న ఆదాయ పన్నుకు మధ్య తేడాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.