News March 18, 2024

రష్యా అధ్యక్షుడిగా మళ్లీ పుతిన్

image

రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారీ మెజార్టీతో గెలిచారు. దాదాపు 88 శాతం ఓట్లతో ఆయన మరోసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఏకపక్షంగా జరిగిన ఎన్నికల్లో ముగ్గురు ప్రత్యర్థులు ఆయనకు నామమాత్రపు పోటీ ఇచ్చారు. ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ మరణంతో పుతిన్‌కు ఎదురు లేకుండా పోయింది. తాజా విజయంతో మరో ఆరేళ్ల పాటు పుతిన్ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.

Similar News

News October 31, 2025

ఐపీవోకు Groww

image

స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ‘గ్రో’ మాతృసంస్థ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ NOV 4-7 మధ్య పబ్లిక్ ఇష్యూకు రానుంది. షేర్ల ధరలను రూ.95-100గా నిర్ణయించింది. ఫ్రెష్ ఇష్యూ కింద రూ.1,060Cr విలువైన షేర్లను, ఆఫర్ ఫర్ సేల్ కింద 55.72 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, వాటాదార్లు విక్రయించనున్నారు. దీంతో రూ.6,632Cr సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. తద్వారా సంస్థ విలువ రూ.61,700Crకు చేరొచ్చని అంచనా.

News October 31, 2025

కర్నూలు ప్రమాదం.. కార్గో క్యాబిన్‌లో రెండో డ్రైవర్ నిద్ర

image

AP: కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ఘటన జరిగినప్పుడు 2వ డ్రైవర్ శివనారాయణ బస్సు కింది భాగంలోని కార్గో క్యాబిన్‌లో నిద్రపోయారు. ప్రమాదం జరగ్గానే డ్రైవర్ లక్ష్మయ్య తన వద్దకు వచ్చినట్లు శివ తెలిపారు. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపు కాలేదన్నారు. బస్సు కుడివైపు అద్దాలు పగలగొట్టి కొందరిని రక్షించామని, ఆ ప్రయత్నం వల్ల 27మంది బతికారని చెప్పారు. ఈ ఘటనలో 19మంది చనిపోయారు.

News October 31, 2025

TG SET దరఖాస్తు గడువు పొడిగింపు

image

తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్‌షిప్‌ అర్హత కోసం నిర్వహించే TG SET-2025 దరఖాస్తు గడువును పొడిగించారు. పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులో తప్పుల సవరణకు నవంబర్ 26 నుంచి 28 వరకు అవకాశం ఇస్తారు. డిసెంబర్ 3న హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ రెండో వారంలో పరీక్ష నిర్వహిస్తారు. వెబ్‌సైట్: http://telanganaset.org/