News January 21, 2025
విశాఖ మీదుగా వెళ్లే 8 రైళ్లకు అదనపు బోగీలు

విశాఖ మీదుగా వెళ్లే 8 రైళ్ళకు అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ తెలిపారు. జనవరి 22 నుంచి 12375/76 నకు ఒక జనరల్ సెకండ్ క్లాస్ కోచ్, మార్చ్ 25నుంచి 12835/36నకు రెండు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు శాశ్వతంగా పెంచనున్నారు. జనవరి 21నుంచి ఫిబ్రవరి 18వరకు 22603/04 నకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను, జనవరి 22 నుంచి ఫిబ్రవరి 19 వరకు 22605/06 నకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను పెంచనున్నారు.
Similar News
News February 1, 2026
విశాఖ: భూముల విలువ పెంపు తాత్కాలిక వాయిదా?

విశాఖలో భూ విలువల పెంపునకు తాత్కాలికంగా బ్రేక్ వేసినట్టు సమాచారం. ఫిబ్రవరి 1 నుంచి కొత్త భూ విలువలు అమలు చేయాలన్న ప్రతిపాదనలపై రిజిస్ట్రేషన్ శాఖ వారు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. వీటిని కమిటీ పరిశీలించి జేసీకు నివేదిక పంపింది. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఆ ఫైల్ జేసీ వద్దే నిలిచిపోయినట్టు తెలుస్తోంది. దీంతో పెంపు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
News February 1, 2026
కేజీహెచ్‌లో రాష్ట్రంలోనే తొలిగా ‘పెయిన్ క్లినిక్’ ప్రారంభం

విశాఖ కేజీహెచ్‌లో రాష్ట్రంలోనే మొదటి ‘పెయిన్ క్లినిక్’ను ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. AMCANA సంస్థ రూ. కోటి విరాళంతో దీనిని ఏర్పాటు చేసింది. దీర్ఘకాలిక, క్యాన్సర్ నొప్పులతో బాధపడే రోగులకు ఈ క్లినిక్ ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. దాతల సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి, పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
News February 1, 2026
విశాఖ: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఆదివారం నుంచి జిల్లాలో ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు రెండు విడతల్లో ఫిబ్రవరి 10 వరకు కొనసాగనున్నాయి. జిల్లావ్యాప్తంగా 35,404 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు హాజరవుతున్నట్లు ఆర్జేడీ మురళీదర్ తెలిపారు. ఎంపీసీ విద్యార్థులు 30,433 కాగా, బైపీసీ వారు 4,971 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం ఇంటర్ బోర్డు అధికారులు జిల్లాలో 159 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.


