News March 18, 2024
గుంటూరు: విద్యార్థులకు RTCలో ఉచిత ప్రయాణం
నేటినుంచి జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ప్రకటించింది. బస్సులో పరీక్షా కేంద్రానికి రాకపోకలు సాగించే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జ్ ప్రజా రవాణా అధికారి నర్రా శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు.
Similar News
News February 3, 2025
గుంటూరు: రైల్వేలో ఉద్యోగం.. ఈరోజే లాస్ట్
SCRలో ఉద్యోగం చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్. స్పోర్ట్స్ కోటా కింద రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్‌లో 31, సికింద్రాబాద్ డివిజన్‌లో 5, హైదరాబాద్-5, విజయవాడ-5, గుంటూరు-5 నాందేడ్-5, గుంతకల్‌లో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత: 10th, ఇంటర్, ITI ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 25 మధ్య ఉండాలి. అప్లై చేసేందుకు చివరి తేదీ: ఫిబ్రవరి 3, 2025.
News February 3, 2025
గుంటూరు: శీలంవారి వీధిలో సప్లయర్ ఆత్మహత్య
కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శీలంవారి వీధిలో ఇనుప దులానికి చీరతో ఉరివేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొన్నూరు రోడ్డులోని ఓ హోటల్లో సప్లయర్‌గా పనిచేస్తున్న శ్రీను(50)రెండేళ్లుగా ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహానికి సంబంధించిన రక్త సంబంధీకుల వివరాలు తెలియకపోవడంతో మృతదేహాన్ని గుంటూరు కోవిడ్ ఫైటర్స్ సహాయంతో జీజీహెచ్ మార్చూరీకి తరలించామని సీఐ వీరయ్య తెలిపారు.
News February 3, 2025
నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు: ఎస్పీ
గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ కోడ్ అమలులో ఉన్నందున జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి అర్జీలు ఇచ్చేందుకు వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించి రావద్దని కోరారు.