News January 21, 2025

VZM: జిల్లాలో 80 శాతం రహదారులు పూర్తి చేశాం: మంత్రి అనిత

image

గుంతలు లేని రహదారుల కార్యక్రమం కింద జిల్లాలో 80 శాతం రహదారులను పూర్తి చేసామని జిల్లా ఇన్‌ఛార్జ్ మినిస్టర్ అనిత అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ఈ నెలాఖరికి 100% రహదారులు పూర్తి చేస్తామన్నారు. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మంత్రి అయిన తర్వాత NREGS కింద రాష్ట్రంలో వందల కోట్లతో పనులు చేపట్టామన్నారు. రెవెన్యూ సిబ్బంది ఎవరికీ కొమ్ము కాయకుండా పనిచేయాలన్నారు.

Similar News

News July 6, 2025

భీమా సౌకర్యాలను ప్రజలు వినియోగించుకోవాలి: కలెక్టర్

image

పీఎం జీవన జ్యోతి, సురక్ష భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పధకాల ద్వారా భీమా పొందాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. అతి తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ రక్షణ పొందవచ్చన్నారు. భీమా పథకాలపై సచివాలయాల స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సామాన్య కుటుంబాలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని చెప్పారు.

News July 6, 2025

VZM: 2,232 పాఠశాలు.. 2,10,377 మంది విద్యార్థులు

image

ఈనెల 10న జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్క‌ర్ శనివారం తెలిపారు. గత ఏడాది కేవలం ప్రభుత్వ పాఠశాలలలోనే నిర్వహించామన్నారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల్లో కూడా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,232 పాఠశాల నుంచి 2,10,377 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలసి హాజరు కానున్నారని తెలిపారు.

News July 6, 2025

ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా జాతీయ లోక్ అదాలత్

image

ఉమ్మడి జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది. విజయనగరంలో 473, పార్వతీపురంలో 119, బొబ్బిలి 69, సాలూరులో 229, శృంగవరపుకోటలో 47, గజపతినగరంలో 347, చీపురుపల్లిలో 38, కొత్తవలసలో 320, కురుపాంలో 14 కేసులు పరిష్కరించామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత తెలిపారు. విజయవంతం చేసిన సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.