News January 21, 2025

అందుకే పనిష్మెంట్ ఇచ్చా: ఈటల

image

TG: తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరిపైనా చేయి ఎత్తలేదని, బూతులు తిట్టలేదని బీజేపీ MP ఈటల రాజేందర్ అన్నారు. కానీ పేదల భూములు కబ్జా అవుతున్నాయనే ఆవేదనతో, ధర్మాన్ని కాపాడేందుకు <<15213239>>ఇవాళ పనిష్మెంట్<<>> ఇచ్చానని చెప్పారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు అధర్మానికి కొమ్ము కాయడం సిగ్గుచేటన్నారు. ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి స్వయంగా చర్యలు తీసుకుని, ప్రజల ఆస్తులు కాపాడాలని డిమాండ్ చేశారు.

Similar News

News January 24, 2026

ఎల్లుండి విజయ్-రష్మిక కొత్త మూవీ టైటిల్ గ్లింప్స్

image

రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా VD14 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ఈ నెల 26న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. 1854-1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్-రష్మిక చేస్తున్న మూడో సినిమా కావడం విశేషం. త్వరలో వీరు పెళ్లి చేసుకోనున్నట్లూ ప్రచారం జరుగుతోంది.

News January 24, 2026

యాత్ర ఇండియా లిమిటెడ్‌లో 3,979 పోస్టులు

image

యాత్ర ఇండియా లిమిటెడ్ 3,979 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీఐ, టెన్త్ అర్హత గలవారు ఫిబ్రవరి 1 నుంచి మార్చి 3 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. మెరిట్, DV, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. టెన్త్ అర్హత గలవారికి నెలకు రూ.8200, ఐటీఐ అభ్యర్థులకు రూ.9600 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://recruit-gov.com/

News January 24, 2026

మీడియా సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న అదానీ

image

అదానీ గ్రూప్ మీడియా రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత విస్తరించింది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్‌ఎస్‌ (Indo Asian News Service)లో మిగిలిన 24% వాటాను కొనుగోలు చేసింది. దీంతో IANS పూర్తిగా అదానీ గ్రూప్ సంస్థగా మారింది. ఇప్పటికే 2023 డిసెంబరులో 50.5% ఉన్న వాటాను 2024 జనవరిలో 76 శాతానికి పెంచుకున్నారు. NDTV, బీక్యూ ప్రైమ్ తర్వాత ఐఏఎన్‌ఎస్‌ కూడా చేతికి రావడంతో మీడియాలో అదానీ ప్రభావం మరింత పెరగనుంది.