News January 21, 2025

విశాఖలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం

image

విశాఖలోని పీఎం పాలెం పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. HPCL లేఔట్‌లోని ఓ ఇంటిలో బాలికపై అత్యాచారం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. 15 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసినట్లు ఆమె తల్లి పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నల్ల సాయితేజను అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తామని సీఐ పేర్కొన్నారు.

Similar News

News January 22, 2025

ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుత ఎమ్మెల్సీ పి రఘువర్మ పదవీకాలం ఈ ఏడాది మార్చి 29తో ముగుస్తుంది. ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తయింది. 123 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 19 వేల ఓటర్లు ఉన్నారు.

News January 22, 2025

విశాఖలో కంపెనీలు పెట్టండి: మంత్రి లోకేశ్

image

పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేశ్ దావోస్‌లో పర్యటిస్తున్నారు. విశాఖలో ఆటో మొబైల్ ఉత్పత్తి, సప్లయ్ చైన్ ఏర్పాటుకు అనువుగా ఉంటుందని ZF ఫాక్స్‌కాన్ CEO దృష్టికి తీసుకెళ్లారు. సిస్కో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ కాట్సోడస్‌ను కోరారు. గ్లోబల్ డెలివరీ కేంద్రాలు, బ్యాక్ ఎండ్ ఐటీ ఆఫీస్ ఏర్పాటు చెయ్యాలని రాజీవ్ మోమానీని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

News January 22, 2025

ఉమ్మడి విశాఖలో 29 మద్యం షాపులు కేటాయింపు

image

రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 28 మద్యం దుకాణాలను కేటాయించింది. అనకాపల్లి జిల్లాలో గౌడ శెట్టిబలిజ యాత కులస్తులకు మొత్తం 15 దుకాణాలను కేటాయించింది. విశాఖ జిల్లాలో 14 దుకాణాలను కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఒక్క దుకాణం కూడా కేటాయించలేదు.