News January 21, 2025

జన్మత: పౌరసత్వం రద్దు.. నెక్స్ట్ ఏంటి?

image

డొనాల్డ్ ట్రంప్ ఆటోమెటిక్ సిటిజన్‌షిప్ రద్దు చేయడంతో పిల్లలు 21 ఏళ్లు వచ్చేసరికి అమెరికా నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే స్టూడెంట్ వీసా తీసుకొని ఆ దేశంలో ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. అయితే వారిని ఇంటర్నేషనల్ స్టూడెంట్లుగా పరిగణిస్తారు. ఫలితంగా ఉపకారవేతనాలు లాంటి యూనివర్సిటీ బెనెఫిట్స్ ఏమీ అందవు. మరోవైపు ఈ నిర్ణయంతో అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

Similar News

News November 13, 2025

రోడ్లకు నేతల పేర్లకు బదులు కంపెనీల పేర్లు: సీఎం

image

TG: దేశంలో రోడ్ల‌కు ఎక్కువగా నేతల పేర్లు ఉన్నాయని, హైదరాబాద్‌లో తాము ఆ ట్రెండ్‌ను మార్చాలనుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్య‌మైన రోడ్ల‌కు గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీ పేర్ల‌ను పెడ‌తామ‌ని అన్నారు. ఢిల్లీలో జరిగిన US-India సమ్మిట్‌లో సీఎం పాల్గొన్నారు. 30 వేల ఎక‌రాల్లో ‘ఫ్యూచ‌ర్ సిటీ’, మూసీ పునరుజ్జీవనం, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులు చేపట్టామన్నారు.

News November 13, 2025

సింగరేణిలో 82 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

సింగరేణిలో 82 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్నల్ అభ్యర్థులతో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 24లోగా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్ కాపీని ఈనెల 26లోగా పంపాలి. బేసిక్ శాలరీ నెలకు రూ.50,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: scclmines.com

News November 13, 2025

ప్రతి కశ్మీరీ ముస్లిం టెర్రరిస్టు కాదు: J&K సీఎం

image

ప్రతి కశ్మీరీ ముస్లిం టెర్రరిస్టు కాదని జమ్మూకశ్మీర్ CM ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఢిల్లీ పేలుడు ఘటనను ఆయన ఖండించారు. అమాయకులను క్రూరంగా చంపడాన్ని ఏ మతమూ సమర్థించదని తెలిపారు. కశ్మీర్‌లో శాంతి, సోదరభావాన్ని నాశనం చేసేవారు కొందరు ఉంటారని విమర్శించారు. బ్లాస్ట్‌ కారకులను కఠినంగా శిక్షించాలని, అమాయకులను వదిలేయాలని కోరారు. ఓ డాక్టర్‌ను <<18268521>>ఉద్యోగం నుంచి తొలగించాక<<>> దర్యాప్తు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.