News March 18, 2024
టెక్కలి పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్‌లు

టెక్కలిలోని ఐదు గ్రామ సచివాలయాల సిబ్బందితోపాటు, మండలంలోని పలువురు గ్రామీణ ప్రాంత పంచాయతీ కార్యదర్శులకు ఆదివారం టెక్కలి ఎంపీడీఓ కె. విజయలక్ష్మి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. టెక్కలి మేజర్ పంచాయతీతో పాటు గ్రామాల్లో ఎన్నికల కోడ్ అమలుకు సంబంధించిన విధులకు గ్రామ సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు హాజరుకాకపోవడంపై నోటీసులు జారీ చేశారు. ఇదే అంశాన్ని టెక్కలి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నివేదించారు.
Similar News
News February 5, 2026
శ్రీకాకుళం: రథసప్తమి వేడుకలు సక్సెస్..అదిక్కొటే మైనస్

రాష్ట్ర పండుగైన రథసప్తమిని అంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులు పకడ్బంధిగా ఏర్పాట్లు చేశారు. అంబారాన్ని తాకేలా ఉత్సవాలు జరిపేందుకు మీడియా ఫ్లాట్ ఫామ్‌లు విస్తృత ప్రచారం చేశాయి. కార్యక్రమాలన్ని సజావుగా జరిగినా..ఊహించని విధంగా వచ్చిన భక్త జనసంద్రానికి ఎటువంటి ఘటనలు జరకుండా దర్శనాలు చేయించడంలో యంత్రాంగం, పోలీసులు పైచేయి సాధించారు. కలకలం రేపిన నకిలీ పాసుల్లో నిజాలు ఖాకీల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
News February 5, 2026
పొందూరు: గడ్డి మందు తాగిన వ్యక్తి మృతి

గడ్డి మందును తాగిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన పొందూరు మండలంలో జరిగింది. మండలంలోని తానే గ్రామానికి చెందిన పాపినాయుడు(65) ఈ నెల 22న రాత్రి మద్యం మత్తులో గడ్డి మందు తాగాడు. అపస్మారక స్థితిలోకి చేరుకోగా కుటుంబీకులు రిమ్స్‌లో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 5, 2026
శ్రీకాకుళం: నకీలి పాసుల కథ నడిపించిందెవరు?

అరసవల్లి రథసప్తమి వేడుకల్లో నకిలీ పాసుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వీటి ముద్రణపై SM ఇన్‌ఫ్లుయోన్సర్ల పాత్ర ఉందని వచ్చిన ఆరోపణలను వారు ఖండించారు. తాజాగా ఆలయానికి సమీప జిరాక్స్ షాపుల్లోనే ఈ ముద్రణ జరిగినట్లు ప్రచారం సాగుతోంది. వేడుకల్లోని కార్యక్రమాలకు వేల సంఖ్యలో పుట్టుకొచ్చిన పాసులకు బాధ్యులెవరో(SM ఇన్‌ఫ్లుయోన్సర్ల? జిరాక్స్ షాపుల? ఇతరుల?) బయటపెట్టేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


