News January 22, 2025

KMR: అప్రమత్తతే ఆయుధం: SP

image

మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ ప్రజలకు సూచించారు. వ్యవసాయ ఉత్పత్తులు, హెర్బల్, హెల్త్ కేర్, ఇతర గృహోపకరణాలు మార్కెటింగ్ పేరుతో కొత్త తరహా మోసాలు జరుగుతున్నాయన్నారు. ఈ మోసాలపై జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుకోకుండా ఒక వేళ ఆ వలలో చిక్కితే వెంటనే 1930 కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News September 19, 2025

ఏలూరు: నంబర్ ప్లేట్లపై ఇలా రాస్తే..ఇక వాహనం సీజ్

image

మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకుంటే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ హెచ్చరించారు. నంబర్ ప్లేట్లపై వారి తాలూకా అనిరాసినా, నిబంధనలకు లోబడి లేకున్నా వాహనాలను సీజ్ చేస్తామన్నారు. వీటి తయారీదారులపై చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నారు. నంబర్ ప్లేట్లపై నేటి నుంచి స్పెషల్ డ్రైవ్లు చేపట్టాలని ఆయన గురువారం ఆదేశించారు.

News September 19, 2025

WGL: ఆర్ఎంపీ, పీఎంపీలపై అధికారుల కొరడా

image

WGL, KZP, HNK, దుగ్గొండి సహా 12 ప్రాంతాల్లో TG మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్య కుమార్ ఆదేశాల మేరకు ఛైర్మన్ డాక్టర్ మహేశ్ కుమార్ గురువారం రాత్రి ఏకకాలంలో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా 18 మంది ఆర్ఎంపీ, పీఎంపీ అనధికారికంగా వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా అధిక మోతాదులో యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారని వారిపై కేసు నమోదు చేశామన్నారు.

News September 19, 2025

VJA: తండ్రితో వెళ్తుండగా ప్రమాదం.. కుమారుడి మృతి

image

విజయవాడలోని అజిత్ సింగ్ నగర్‌లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. సింగినగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్తిపాటి గిరిబాబు అనే వ్యక్తి తన తండ్రితో కలిసి నడిచి వెళ్తుండగా, వేగంగా వచ్చిన బైక్ ఢీకొంది. ఈ ఘటనలో గిరిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.