News January 22, 2025
కేజ్రీవాల్‌పై బీజేపీ ‘చునావీ హిందూ’ ఎటాక్
రామాయణంలోని ఓ అంశాన్ని ఆప్ అధినేత కేజ్రీవాల్ తప్పుగా చెప్పడంపై ఢిల్లీ ఎన్నికల వేళ BJP ఆయనపై ఎటాక్ చేస్తోంది. ‘చునావీ(ఎన్నికల) హిందూ’ అంటూ విమర్శిస్తోంది. ఆయన సనాతన ధర్మాన్ని కించపరిచారని ఢిల్లీ BJP అధ్యక్షుడు V. సచ్‌దేవా మండిపడ్డారు. ఎన్నికలప్పుడే ఆయనకు ఆలయాలపై ప్రేమ పుట్టుకొస్తుందని ఎద్దేవా చేశారు. BJP నేతలు రావణుడిని ఇష్టపడుతున్నారని, వారి స్వభావం అలాంటిదే అని కేజ్రీవాల్ ఎదురుదాడికి దిగారు.
Similar News
News January 22, 2025
APSP బెటాలియన్లలో మార్పులు
APSP బెటాలియన్లలో మంగళగిరి, కర్నూలు కేంద్రంగా DIGలు ఉంటారని హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి DIG పరిధిలోకి ఎచ్చెర్ల, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయనగరం, మంగళగిరి, మద్దిపాడు, విశాఖ బెటాలియన్లను, DIG-2 పరిధిలోకి కర్నూలు, చిత్తూరు, వెంకటగిరి, కడప, అనంతపురం బెటాలియన్లతో పాటు SAR సీపీఎల్ యూనిట్‌ను చేర్చింది.
News January 22, 2025
ట్రంప్ మరో సంచలన నిర్ణయం
US అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ సిబ్బందిని సెలవుపై వెళ్లిపోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. త్వరలోనే వారందరికీ లేఆఫ్‌లు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా అధికారంలోకి రాగానే జన్మత: పౌరసత్వం, WHO నుంచి USA ఎగ్జిట్, దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ వంటి నిర్ణయాలతో ట్రంప్ అందరినీ ఆశ్చర్యపరిచారు.
News January 22, 2025
భారత్ ఫోర్జ్ ప్రతినిధులతో లోకేశ్ భేటీ
AP: దావోస్ పర్యటనలో భాగంగా భారత్ ఫోర్జ్ సంస్థ వైస్ ఛైర్మన్ కళ్యాణితో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. APలో రక్షణ పరికరాల తయారీ త్వరగా ప్రారంభించాలని కోరారు. R&D శిక్షణ కేంద్రం, రక్షణ పరికరాల తయారీ కోర్సులు, ITIలలో స్కిల్ డెవలప్మెంట్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మడకశిర పరిధిలో రూ.2400 కోట్లతో రక్షణ పరికరాల యూనిట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు భారత్ ఫోర్జ్ ప్రతినిధులు లోకేశ్‌కు బదులిచ్చారు.