News March 18, 2024

MDK: పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

image

పదోతరగతి పరీక్షలకు వేళైంది. నేటి నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు జరిగే పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతుంది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. నిమిషం నిబంధన ఎత్తివేశారు. మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో 269 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 46,356 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.

Similar News

News April 10, 2025

బెట్టింగుకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మెదక్ జిల్లాలో ఎవరైనా క్రికెట్ మరే ఇతర బెట్టింగ్లకు పాల్పడిన ప్రోత్సహించిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడినట్లు సమాచారం అందితే డైల్ 100 లేదా 8712657888 నంబర్‌కు సంప్రదించాలన్నారు.

News April 10, 2025

పేదలకు సన్న బియ్యం పథకం అందజేత: కలెక్టర్

image

టేక్మల్ మండలం చంద్రుతాండ గ్రామంలోని సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ భోజనం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి సన్న బియ్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. కలెక్టర్‌తో పాటు ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎంపీఓ, పంచాయతీ అధికారి భోజనం చేశారు.

News April 10, 2025

మెదక్: 11న పూలే జయంతి: కలెక్టర్

image

మహిళలు, బలహీనవర్గాల విద్యాభివృద్ధి రూపకర్త, సమ సమాజ స్థాపనకు స్ఫూర్తిదాత, మానవ హక్కుల అవిశ్రాంత యోధుడు మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని ఈ నెల 11న అధికారికంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. 11న ఉదయం 10:30 గంటలకు ధ్యాన్ చంద్ చౌరస్తాలో గల జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాల అనంతరం కలెక్టరేట్లో కార్యక్రమం ఉంటుందన్నారు.

error: Content is protected !!