News January 22, 2025
VZM: కానిస్టేబుల్ ఎంపికలు..448 మంది ఎంపిక

విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య ఎంపిక ప్రక్రియ మంగళవారం సజావుగా జరిగింది. మొత్తం 652 మంది అభ్యర్థులు PMT, PET పరీక్షలకు హాజరయ్యారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. వీరిలో 448 మంది తుది రాత పరీక్షకు ఎంపికయ్యారన్నారు. గడిచిన 15 రోజులుగా జరుగుతున్న ఎంపిక ప్రక్రియలో ఇప్పటి వరకు 3,745 మంది పురుష అభ్యర్థులు, 479 మంది మహిళ అభ్యర్థినులు రాత పరీక్షకు ఎంపికయ్యారన్నారు.
Similar News
News February 27, 2026
చీపురుపల్లి: సీఎం వస్తున్నారు.. కీలక ప్రకటన ఉంటుందా..!

చీపురుపల్లి(M) రావివలసలో శనివారం CM చంద్రబాబు పర్యటించనున్న విషయం తెలిసిందే. దీంతో నియోజకవర్గంలో పలు సమస్యలపై సీఎం ప్రకటన చేస్తారని ప్రజలు నిరీక్షిస్తున్నారు. సుమారు 80 వేల మంది కోరుకుంటున్న RECS పునరుద్ధరణ, తోటపల్లి పిల్ల కాలువల నిర్మాణం, చీపురుపల్లి ఏరియా ఆసుపత్రికి, గరివిడి పశుసంవర్ధక కళాశాలకు అదనపు భవనాలు మంజూరు, చీపురుపల్లిలో ఇండోర్ స్టేడియం నిర్మాణం పూర్తిపై హామీ కోసం ఎదురుచూస్తున్నారు.
News February 27, 2026
విజయనగరం: సైకో కిల్లర్ ఉపేంద్ర బాబు హత్య

అనకాపల్లి(D) మాడుగుల(M) జంపినకు చెందిన సీరియల్ సైకో కిల్లర్ పెచ్చేటి ఉపేంద్ర బాబును గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఉపేంద్ర బాబు ఐదు మర్డర్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల విజయనగరం జిల్లాలో చేసిన దొంగతనం కేసులో జైలుకు వెళ్లి, బెయిల్ మీద బయటకు వచ్చాడు. కాగా మారణాయుధాలతో ఉపేంద్ర బాబును హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్నివివరాలు తెలియాల్సి ఉంది.
News February 27, 2026
VZM: జిల్లాలో 122 కొత్త పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు

ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి కోరారు. గురువారం అయన ఛాంబర్‌లో పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. విజయనగరం జిల్లాలో మొత్తం 15,76,018 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం 1,847 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. కొత్తగా 122 స్టేషన్లకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. గుర్తింపు పొందిన పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలన్నారు.


