News January 22, 2025
కడప: ‘నేరస్థులకు శిక్ష.. బాధితులకు న్యాయం’

నేరం చేసిన వారికి శిక్ష, బాధితులకు న్యాయం జరిగేలా పోలీస్ అధికారులు కృషి చేయాలని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు పోలీస్ అధికారులను ఆదేశించారు. కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆధ్వర్యంలో కడప, అన్నమయ్య జిల్లాల పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానంతో, నిబద్ధతతో నేరాల కట్టడికి కృషి చేయాలన్నారు.
Similar News
News January 19, 2026
కడప: చంద్రప్రభ వాహనంపై దర్శనం

దేవుని కడప వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీలక్ష్మి సమేత వేంకటేశ్వర స్వామి చంద్రప్రభ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, రంగురంగుల పూలమాలలతో అలంకరించారు. చంద్రప్రభ వాహనంపై గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు కాయాకర్పూరం సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు.
News January 19, 2026
కడప పోలీసులకు 76 ఫిర్యాదులు

కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే సోమవారం నిర్వహించారు. ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అధ్యక్షతన పోలీస్ అధికారులు అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను పోలీస్ అధికారులకు విన్నవించుకున్నారు. మొత్తంగా 76 ఫిర్యాదులు వచ్చాయి. వీటిని సకాలంలో విచారణ జరిపి, పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.
News January 19, 2026
కడప: బాలికపై అత్యాచారం.. ఇద్దరికి జైలుశిక్ష

అత్యాచారం కేసులో ఇద్దరికి జైలుశిక్ష పడింది. ప్రొద్దుటూరులో 16 ఏళ్ల బాలికను 2022లో పఠాన్ సాదక్, బి.చెన్నయ్య 2022లో బాలికను మభ్యపెట్టి గర్భవతిని చేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు, తలా రూ.2 వేల జరిమానా విధిస్తూ కడప పోక్సో కోర్టు ఇన్‌ఛార్జ్ జడ్జి ఎస్.ప్రవీణ్ కుమార్ సోమవారం తీర్పునిచ్చారు. కేసును విజయవంతంగా నిరూపించిన పోలీసులను ఎస్పీ నచికేత్ అభినందించారు.


