News March 18, 2024

ASF:’ ముచ్చటగా మూడోసారి ఆయనే’

image

కేంద్రంలో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వమే వస్తుందని సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం కాగజ్ నగర్ మండలం రాంనగర్ గ్రామ ముఖ్యకార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి మరోసారి అధికారం ఇచ్చేందుకు యావత్ దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు ప్రతిఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Similar News

News April 4, 2025

ఉట్నూర్: ‘TASK శిక్షణతో ఉపాధి సాధన సులువు’

image

యువతలో నైపుణ్యాలు పెంపొందించి ఉద్యోగ సాధనకు మార్గాన్ని సులువు చేయడమే లక్ష్యంగా టాస్క్ ముందుకు సాగుతుందని ప్రిన్సిపాల్ టి.ప్రతాప్ సింగ్ అన్నారు. శుక్రవారం ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టాస్క్ ఆధ్వర్యంలో Campus to Corporate C2C అంశంపై రెండు రోజుల పాటు జరిగిన శిక్షణ తరగతులు శుక్రవారం ముగిశాయి. ఈ తరగతులకు కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

News April 4, 2025

ఆదిలాబాద్: డిగ్రీ విద్యార్థులకు GOOD NEWS

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును KU అధికారులు పొడిగించిన విషయం తెలిసిందే. కాగా వీటితో పాటు 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలు సైతం రాసేందుకు అవకాశం కల్పించినట్లు KU అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 1, 3, 5 పరీక్ష ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 11 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 4, 2025

ADB ఆదివాసీ సంఘం జిల్లా ప్రధానకార్యదర్శిగా వరుణ్

image

ఆదివాసి హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధానకార్యదర్శిగా వరుణ్ ను ఎన్నుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని ఆదివాసీ భవన్‌లో ఆదివాసీ విద్యార్థి సంఘం సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం నూతన జిల్లా కమిటీ ఎన్నుకున్నారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శిగా వరుణ్ మరోసారి ఎన్నుకున్నారు. ఆదివాసి విద్యార్థుల సమస్యలపై పోరాడుతానని, ఆదివాసుల విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

error: Content is protected !!