News January 22, 2025
APSP బెటాలియన్లలో మార్పులు
APSP బెటాలియన్లలో మంగళగిరి, కర్నూలు కేంద్రంగా DIGలు ఉంటారని హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి DIG పరిధిలోకి ఎచ్చెర్ల, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయనగరం, మంగళగిరి, మద్దిపాడు, విశాఖ బెటాలియన్లను, DIG-2 పరిధిలోకి కర్నూలు, చిత్తూరు, వెంకటగిరి, కడప, అనంతపురం బెటాలియన్లతో పాటు SAR సీపీఎల్ యూనిట్‌ను చేర్చింది.
Similar News
News January 22, 2025
పవన్‌ను ముందు పెట్టి బీజేపీ డ్రామాలు: అద్దంకి
ఏపీలోని కూటమి ప్రభుత్వంలో లుకలుకలు మొదలయ్యాయని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. ‘చంద్రబాబుతో కయ్యం తమ పార్టీ ఉనికికే ప్రమాదమని బీజేపీకి తెలుసు. అందుకే పవన్ కళ్యాణ్‌ను ముందు పెట్టి ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. మిత్ర పార్టీలతో లబ్ధి పొంది, ఆ పార్టీలను అంతం చేయడం బీజేపీకి ఉన్న అలవాటే. రాజకీయ స్వార్థమే ఆ పార్టీని పతనం వైపు నెడుతోంది’ అని విమర్శించారు.
News January 22, 2025
మీ పిల్లలకు ఈ పాటనూ నేర్పించండి!
ఇప్పుడంటే పిల్లలకు ‘ట్వింకిల్.. ట్వింకిల్ లిటిల్ స్టార్’ అంటూ రైమ్స్ నేర్పిస్తున్నారు. కానీ, ఒకప్పుడు తెలుగు పద్యాలు ఎంతో వినసొంపుగా ఉండేవి. ముఖ్యంగా 60లలో ఉండే పద్యాన్ని ఓ నెటిజన్ గుర్తుచేశారు. ‘బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రు మన్నది. పడమటింటి కాపురం చేయనన్నది. అత్త ఇచ్చిన కొత్త చీర కట్టనన్నది. మామ తెచ్చిన మల్లెమొగ్గ ముడువనన్నది. మగని చేత మొట్టికాయ తింటానన్నది’ ఇదే ఆ పాట. ఇది మీరు విన్నారా?
News January 22, 2025
అమెరికా నుంచి 18000 మంది వెనక్కి!
డొనాల్డ్ ట్రంప్ పాలసీలకు తగినట్టు భారత్ ప్రణాళికలు వేసుకుంటోంది. USతో అనవసరంగా ట్రేడ్‌వార్ తెచ్చుకోకుండా ఉండేందుకు 18,000 అక్రమ వలసదారులను వెనక్కి తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. 2 దేశాలూ కలిసి వీరిని గుర్తించాయి. స్టూడెంట్, వర్క్ వీసాలతో లీగల్‌గా అక్కడికి వెళ్లినవారికి అడ్డంకులు రావొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. లేదంటే వీసాలు, గ్రీన్‌కార్డులు తగ్గించి ట్రంప్ తిప్పలు పెట్టొచ్చు.