News January 22, 2025
కామారెడ్డి జిల్లాకు పామాయిల్ తయారీ యూనిట్

కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం యూనిలివర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. CM రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారుల బృందంతో యూనిలివర్ కంపెనీ ప్రతినిధులు జరిపిన చర్చల అనంతరం అంగీకరించారు. పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
Similar News
News October 28, 2025
ఆదిలాబాద్: ‘ఎల్లుండి స్కూళ్లు, కాలేజీలు బంద్’

ఈనెల 30న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరిగే విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి గణేశ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల నుంచి పెండింగ్‌లో పెట్టిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రియంబర్స్‌మెంట్‌ను విడుదల చేయకుండా పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందన్నారు. దీపావళిలోపు రూ.1,200 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆరోపించారు.
News October 28, 2025
‘మొంథా’ తుఫాన్.. సహాయక చర్యలకు ప్రభుత్వం సిద్ధం

* అత్యవసర పరిస్థితుల్లో ప్రజల సౌకర్యార్థం 488 కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
* ఇప్పటికే 75,802 మందిని పునరావాస కేంద్రాలకు తరలింపు
* పలు జిల్లాల్లో 219కి పైగా వైద్యశిబిరాలు ఏర్పాటు
* అత్యవసర కమ్యూనికేషన్ కోసం 81 వైర్‌లెస్ టవర్లు ఏర్పాటు
* సహాయక చర్యలకు 321 డ్రోన్లు సిద్ధం, అందుబాటులో JCBలు, క్రేన్లు
* ఇప్పటికే 38 వేల హెక్టార్లలో పంట నష్టం, 1.38 లక్షల హెక్టార్ల ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారుల అంచనా
News October 28, 2025
‘యూనిటీ మార్చ్’లో యువత చురుగ్గా పాల్గొనాలి: ఎంపీ అరవింద్

ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ‘సర్దార్@150 యూనిటీ మార్చ్’లో యువత, విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పిలుపునిచ్చారు. దేశ ఏకత, సమగ్రతకు పటేల్ స్ఫూర్తినిచ్చారని, ఆయన ఆదర్శాలను యువత అనుసరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన నిజామాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగిత్యాల జిల్లా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.


