News March 18, 2024

కాకినాడ: పవన్ కళ్యాణ్ అభిమాని మృతి

image

ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచికి చెందిన పవన్‌కళ్యాణ్ అభిమాని తాడి గంగాధర్ నవీన్ (30), రాజేశ్, సురేశ్, వెల్దుర్తికి చెందిన సత్యనారాయణ, ఉమాశంకర్‌ 2 బైక్‌లపై ప్రత్తిపాడుకు వెళ్తుండగా విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న కారు ఢీ కొంది. ఈ ఘటనలో నవీన్ చనిపోగా..మిగతావారికి గాయాలయ్యాయి. నవీన్ తల్లిదండ్రులతో HYDలో ఉండగా ఆదాయం సరిపోవట్లేదని భార్య, పిల్లలతో 2నెలల క్రితమే ఉత్తరకంచికి వచ్చాడని గ్రామస్థులు చెబుతున్నారు.

Similar News

News September 7, 2025

వేడుకలు మతసామరస్యానికి ప్రతీకగా నిలిచాయి: ఎస్పీ

image

వినాయక చవితి వేడుకలు, మిలాద్ – ఉన్ – నబీ వేడుకలు జిల్లాలో శాంతియుతంగా జరిగాయని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. ఈ పండుగలు మత సామరస్యాన్ని చాటి చెప్పాయన్నారు. విజయవంతంగా వేడుకలు నిర్వహించిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు. సహకరించిన కమిటీలు, రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు.

News September 7, 2025

ధవలేశ్వరం: తగ్గుముఖం పట్టిన వరద

image

ధవలేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. శనివారం రాత్రి 9 గంటలకు 7,38,035 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు సాగునీటి అవసరాల కోసం 14,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి వరద ప్రవాహం సాధారణ స్థితికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

News September 7, 2025

రాజమండ్రి: కేసుల దర్యాప్తుకు కొత్త జాగిలాలు

image

కేసుల దర్యాప్తు, నేరస్థుల గుర్తింపులో పోలీసు శాఖను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త జాగిలాలు వచ్చినట్లు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిశోర్ తెలిపారు. ఈ నూతన జాగిలాల చేరికతో దర్యాప్తు మరింత శక్తివంతంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. ‘రాడో’ అనే జాగిలం శిక్షణ కాలంలో రాష్ట్రస్థాయిలో మూడో స్థానం సాధించిందని ప్రశంసించారు. డాగ్ హ్యాండ్లర్ల కృషిని ఆయన అభినందించారు.