News January 22, 2025

VIRAL: MLA పద్మారావు లేటెస్ట్ ఫొటో

image

సికింద్రాబాద్ MLA T.పద్మారావు గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. వ్యక్తిగత పనులతో ఆయన ఆదివారం డెహ్రాడూన్ వెళ్లారు. ఛాతిలో నొప్పి రావడంతో అక్కడే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్లు స్టంట్ వేసి డిశ్చార్జ్ చేశారని తెలిపారు. అయితే, డెహ్రాడూన్‌లోని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పద్మారావు కోలుకున్నారని, ఆస్పత్రిలో కుటుంబీకులతో దిగిన ఫొటోలను బీఆర్ఎస్ శ్రేణులు షేర్ చేస్తున్నాయి.

Similar News

News July 5, 2025

HYD: GHMC వెబ్‌సైట్‌లో ఈ సదుపాయాలు

image

ఆస్తి పన్నుకు సంబంధించి ప్రజల సౌకర్యార్థం కొన్ని సదుపాయాలను GHMC వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్ మెంట్, రివిజన్, వేకెన్సీ రెమిషన్, యజమాని పేరు కరెక్షన్, డోర్ నెంబర్ కరెక్టన్, అసెస్ మెంట్ మినహాయింపు, ప్రాపర్టీ టాక్స్ సెల్ఫ్ అసెస్మెంట్ ఉన్నాయన్నారు. ప్రజలు ఈ సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు.

News July 5, 2025

రాజేంద్రనగర్: 8 నుంచి డిప్లొమా కోర్సుల కౌన్సిలింగ్

image

ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 8 నుంచి 11 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా.విద్యాసాగర్ తెలిపారు. కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విద్యార్థుల ర్యాంకుల వివరాలు, ఆయా తేదీలు కోసం వెబ్ సైట్‌ను చూడాలన్నారు. ఈ కౌన్సిలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు కోర్సులకు సంబంధిత ఫీజును తీసుకురావాలని సూచించారు.

News July 5, 2025

HYD: వీకెండ్ స్పెషల్.. నేచర్ క్యాంప్

image

HYD శివారు మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్కులో వీకెండ్ స్పెషల్ ఎంజాయ్ చేసేందుకు సువర్ణ అవకాశం. నేటి సా.5 నుంచి ఆదివారం ఉ.9:30 వరకు నేచర్ క్యాంపు ఉంటుంది. టీం బిల్డింగ్, పిచ్చింగ్, రాత్రిపూట అడవిలో వాకింగ్, నైట్ క్యాంపింగ్, ఉదయం బర్డ్ వాచింగ్, ట్రేక్కింగ్ చేయొచ్చు. ఐదేళ్ల లోపు పిల్లలకు ఫ్రీ. మిగతా వారికి రూ.1,199 అని అధికారి రంజిత్ తెలిపారు. వివరాలకు 7382307476 నంబర్‌ను సంప్రదించండి.