News March 18, 2024
దర్శి: బైకులు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు

రెండు బైకులు ఢీకొని ముగ్గురు యువకులకు గాయాలైన సంఘటన దర్శి మండలంలోని రాజంపల్లి వద్ద ఆదివారం చోటుచేసుకుంది. క్షతగాత్రుల బంధువు కథనం మేరకు.. పొదిలి విశ్వనాథపురానికి చెందిన అస్మత్ బాషా, చరణ్‌తేజ బైక్‌పై దర్శి వెళ్తున్నారు. అదే మార్గంలో ముందు వెళ్తున్న రాజంపల్లికి చెందిన గుర్రపుశాల నాగార్జున గేదెలు అడ్డురావడంతో ముందు బైక్‌ను ఢీకొని పడిపోయారు. క్షతగాత్రులను పొదిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Similar News
News April 3, 2025
ఒంగోలు: నేటి నుంచి 10th స్పాట్ వ్యాల్యువేషన్

10th పబ్లిక్ పరీక్షలు ఈ నెల 1వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. కాగా గురువారం నుంచి 10th స్పాట్ వ్యాల్యువేషన్ నిర్వహిస్తున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని డీఆర్ఆర్ మున్సిపల్ హై స్కూల్‌లో స్పాట్ వ్యాల్యువేషన్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సోషల్ స్టడీస్‌కు సంబంధించిన టీచర్స్‌కు శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయని, మిగిలిన సబ్జెక్టులకు ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయని తెలిపారు.
News April 3, 2025
ప్రకాశం: కానిస్టేబుల్‌పై కత్తితో దాడి

స్థల వివాదం నేపథ్యంలో CISF కానిస్టేబుల్ నాగేశ్వరరావుపై దాడి చేశారు. ఈ ఘటన ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల మండలం గవినివారిపాలెంలో జరిగింది. భరత్, వీరయ్య, లక్ష్మీనారాయణకు, నాగేశ్వరరావుకు స్థల గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్‌పై మరో ఇద్దరితో కలిసి వారు దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదుతో బుధవారం 5గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
News April 3, 2025
ప్రకాశం వెబ్‌సైట్‌లో ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా

ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ జిల్లా, మండల పరిషత్, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయుల సబ్జెక్టు వారిగా సాధారణ సీనియార్టీ జాబితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఎవరైనా అభ్యంతరాలు కలిగి ఉంటే ఈనెల 9వ తేదీ లోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి సమర్పించాలని సూచించారు.