News January 22, 2025
పవన్‌ను ముందు పెట్టి బీజేపీ డ్రామాలు: అద్దంకి
ఏపీలోని కూటమి ప్రభుత్వంలో లుకలుకలు మొదలయ్యాయని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. ‘చంద్రబాబుతో కయ్యం తమ పార్టీ ఉనికికే ప్రమాదమని బీజేపీకి తెలుసు. అందుకే పవన్ కళ్యాణ్‌ను ముందు పెట్టి ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. మిత్ర పార్టీలతో లబ్ధి పొంది, ఆ పార్టీలను అంతం చేయడం బీజేపీకి ఉన్న అలవాటే. రాజకీయ స్వార్థమే ఆ పార్టీని పతనం వైపు నెడుతోంది’ అని విమర్శించారు.
Similar News
News January 22, 2025
చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్
టీమ్ ఇండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చరిత్ర సృష్టించారు. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అర్ష్‌దీప్ అవతరించారు. ఇప్పటివరకు ఆయన 97 వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో ఆయన ఈ ఫీట్ సాధించారు. ఈ క్రమంలో యుజ్వేంద్ర చాహల్ (96) రికార్డును అర్ష్‌దీప్ అధిగమించారు.
News January 22, 2025
డిపోల ప్రైవేటీకరణ అవాస్తవం: TGSRTC
ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ ప్రయత్నాలంటూ జరుగుతున్న ప్రచారాన్ని TGSRTC ఖండించింది. ఎలక్ట్రిక్ బస్సుల మెయిన్టనెన్స్, ఛార్జింగ్ మినహా ఆపరేషన్స్ అంతా TGSRTC ఆధ్వర్యంలోనే జరుగుతుందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారమే ఎలక్ట్రిక్ బస్సుల్ని తీసుకొస్తున్నామని, ఈ ఏడాది మేలో మరిన్ని బస్సులు అందుబాటులోకి వస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది.
News January 22, 2025
INDvsENG టీ20ల్లో మోస్ట్ రన్స్, వికెట్స్ వీరివే
☛ మోస్ట్ రన్స్: విరాట్ కోహ్లీ – 648 (38.11 avg), జోస్ బట్లర్ – 498 (33.20), రోహిత్ శర్మ – 467 (35.92), జాసన్ రాయ్ – 356 (23.73), ఇయాన్ మోర్గాన్ – 347 (26.69)
☛ మోస్ట్ వికెట్స్: జోర్డాన్ (24), చాహల్ (16), హార్దిక్ (14), బుమ్రా (9), భువనేశ్వర్ (9).