News January 22, 2025
ఐటీ సోదాలు అందరిపై జరుగుతున్నాయి: దిల్ రాజు
హైదరాబాద్‌లోని తన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరగడంపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. ‘సోదాలు నా ఒక్కడిపైనే జరగడం లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం జరుగుతున్నాయి’ అని అన్నారు. నిన్నటి నుంచి SVC, మైత్రి మూవీస్‌తో పాటు పలు సంస్థల కార్యాలయాలపై ఐటీ తనిఖీలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
Similar News
News January 22, 2025
GREAT: పొద్దున పోలీస్.. సాయంత్రం టీచర్
హరియాణాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ అజయ్ గ్రేవాల్ రోజంతా ఉద్యోగం చేసి, సాయంత్రం ఉపాధ్యాయుడిగా మారుతారు. 2016 నుంచి ఆర్థికంగా వెనుకబడిన యువకులకు ఉచితంగా UPSC, తదితర ప్రభుత్వ ఉద్యోగాలకు కోచింగ్ అందిస్తున్నారు. ఇంటి టెర్రస్‌పైనే జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, గణితం, ఇంగ్లిష్, హిందీ వంటి సబ్జెక్టులను బోధిస్తారు. ఇప్పటివరకు ఆయన కోచింగ్ వల్ల 3వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినట్లు సమాచారం.
News January 22, 2025
BIG BREAKING: రాష్ట్రానికి భారీ పెట్టుబడి
తెలంగాణలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. ఇందులో భాగంగా ఆ కంపెనీ భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టు చేపట్టనుంది. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ప్రాజెక్టులు రానున్నాయి. 7వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో ఈ ఎంవోయూ జరిగింది.
News January 22, 2025
దారుణం.. భార్యను ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడికించాడు!
హైదరాబాద్ మీర్‌పేట్‌లో వెంకట మాధవి (35) అనే మహిళ హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి. ఆమెపై అనుమానంతో భర్త గురుమూర్తే చంపి, మృతదేహాన్ని ముక్కలుగా చేసినట్లు దర్యాప్తులో తేలింది. వాటిని కుక్కర్‌లో ఉడికించి, ఆ తర్వాత జిల్లెలగూడ చెరువులో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈనెల 18 నుంచి మాధవి కనిపించకుండా పోయింది. ఆమె తల్లిదండ్రులతో కలిసి భర్త కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.