News January 22, 2025

ఆయుష్మాన్ భారత్‌కు ‘ఆప్‌’ద అడ్డంకులు: మోదీ

image

ఆమ్‌ఆద్మీ వంచన, అబద్ధాలకు శీశ్‌మహలే పెద్ద ఉదాహరణ అని PM మోదీ అన్నారు. ఢిల్లీ BJP కార్యకర్తలతో మాట్లాడారు. ‘ఉచిత వైద్యం అందించే ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయాలని ‘ఆప్‌’ద మనుషుల్ని కోరాం. కానీ వాళ్లు ఒప్పుకోలేదు. ఎన్నో ప్రయోజనాలున్న ఈ స్కీమ్ అమలుకు ఆప్‌ద అడ్డంకులు సృష్టించింది. భారత ఎకానమీకి మిడిల్‌క్లాసే వెన్నెముకని బీజేపీ భావిస్తుంది. వారి ఆశలు, ఆశయాలను మనం అర్థం చేసుకున్నాం’ అని అన్నారు.

Similar News

News July 6, 2025

విజయానికి 5 వికెట్లు

image

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో ఐదో రోజు భారత బౌలర్ ఆకాశ్‌దీప్ అదరగొడుతున్నారు. మ్యాచ్ ప్రారంభమైన 5 ఓవర్లకే రెండు కీలక వికెట్లు తీశారు. పోప్(24), బ్రూక్(23)ను ఔట్ చేశారు. దీంతో ఇంగ్లండ్ 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆకాశ్ 4 వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ తీశారు. ENG స్కోరు 83/5. ఇంకా 5 వికెట్లు తీస్తే భారత్‌దే విజయం.

News July 6, 2025

ఆట ప్రారంభం.. 10 ఓవర్ల కోత

image

ఐదో రోజు వర్షం కారణంగా దాదాపు గంటన్నరకు‌పైగా నిలిచిన భారత్ VS ఇంగ్లండ్ రెండో టెస్టు మ్యాచ్ ఆట ప్రారంభమైంది. 80 ఓవర్లు నిర్వహించాలని అంపైర్లు నిర్ణయించారు. ఈ మ్యాచులో భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సి ఉంది. అటు ఇంగ్లండ్ కష్ట సాధ్యమైన 536 పరుగులు ఛేదించాల్సి ఉంది. దీంతో ఆ జట్టు డ్రా కోసమే ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం ENG స్కోరు 72/3. క్రీజులో పోప్(24), బ్రూక్(15) ఉన్నారు.

News July 6, 2025

కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కిట్‌పై వివాదం?

image

టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కిట్‌పై వివాదం నెలకొంది. భారత జట్టుకు ప్రస్తుతం అడిడాస్ స్పాన్సరర్‌గా వ్యవహరిస్తోంది. కానీ నిన్న ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయంలో గిల్ నైక్ టీ షర్ట్ ధరించారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. మ్యాచ్ జరిగే సమయంలో స్పాన్సర్ కిట్‌ను కాదని ఇతర కిట్స్ ఉపయోగించడం ఏంటని నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.