News March 18, 2024
ఏలూరు: నర్సుతో LOVE.. గర్భవతిని చేసి మోసం
ఏలూరు జిల్లాలో యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు నమోదైంది. వివరాలు.. ఏలూరుకు చెందిన యువతి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. నూజివీడుకు చెందిన పురమా సాయిబాబు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఆమె అతడికి దగ్గరైంది. ఈ క్రమంలోనే గర్భం దాల్చింది. ఆ తర్వాత అబార్షన్ చేయించి.. పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. యువతి ఫిర్యాదుమేరకు కేసు నమోదైంది.
Similar News
News December 21, 2024
భీమవరంలో పలు రైస్ మిల్లు తనిఖీలు నిర్వహించిన కలెక్టర్
పీడీఎస్ బియ్యం అవకతవకలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. శనివారం భీమవరం మండలం నరసింహపురం వద్ద పలు రైస్ మిల్లులను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు.
News December 21, 2024
తణుకు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
తణుకు జాతీయ రహదారిపై డిమార్ట్ సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామానికి చెందిన కూరగాయల వ్యాపారి అడ్డగర్ల సుబ్రహ్మణ్యం (45) బైక్‌పై వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుబ్రహ్మణ్యం మృతదేహం నుజ్జునుజ్జైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 21, 2024
ఉండి: పార్శిల్లో డెడ్‌బాడీ.. ఆ లేడీ ఎవరు?
ఉండి(M) యండగండిలో పార్శిల్లో <<14930123>>డెడ్‌బాడీ <<>>ఘటన గంటకో మలుపు తిరుగుతోంది. ఓ ప్లేస్‌లో పార్శిల్ ఉందని ఆటో డ్రైవర్‌కు ఓ మహిళ కాల్ చేసి చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు అతను దానిని తీసుకెళ్లి తులసికి ఇచ్చాడని తెలుస్తోంది. కాగా పదేళ్ల కిందటే మిస్ అయిన తులసి భర్త, డెడ్‌బాడీ వచ్చిన తర్వాత మాయమైన తులసి చెల్లి భర్త ఎక్కడున్నారు? కాల్ చేసిన మహిళ, డెడ్‌బాడీ ఎవరిది అనే ప్రశ్నలకు జవాబు తెలియాల్సి ఉంది.