News January 22, 2025

దావోస్‌లో టీమ్ ఇండియా: సీఎం చంద్రబాబు

image

ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ దావోస్‌లో భేటీ అయ్యారు. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో టీమ్ ఇండియా’ అంటూ ఈ ఫొటోను చంద్రబాబు Xలో పోస్ట్ చేశారు. దేశం, రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణలు, సాంకేతికత, ఏఐ, ఉద్యోగాలు వంటి అనేక అంశాలపై వీరు చర్చించినట్లు సమాచారం.

Similar News

News February 3, 2026

క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం

image

ఒకే ఆటగాడు రెండు దేశాల తరఫున క్రికెట్ ఆడిన ఘటనలు గతంలో చూశాం. కానీ రెండు దేశాల తరఫున వేర్వేరు క్రీడల్లో వరల్డ్ కప్‌లో పాల్గొన్న అరుదైన ఘట్టం తొలిసారి చోటుచేసుకోనుంది. 2006లో సౌతాఫ్రికా తరఫున హాకీ వరల్డ్ కప్ ఆడిన వేన్ మ్యాడ్‌సన్ 20 ఏళ్ల తర్వాత ఇటలీ T20 WC కెప్టెన్‌గా బరిలో దిగనున్నారు. ఈయన గతంలో PSL, BPL, హండ్రెడ్ లీగ్‌లలోనూ పాల్గొన్నారు. ఇటలీ తరఫున 2023లో అరంగేట్రం చేశారు.

News February 3, 2026

అందుకే ప్రధాని మోదీ భయపడుతున్నారు: రాహుల్

image

ప్రధాని మోదీ తన ఇమేజ్ పోతుందనే భయపడుతున్నారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. USలో అదానీ గ్రూప్‌పై ఉన్న కేసు నిజానికి మోదీ ఆర్థిక వ్యవస్థను టార్గెట్ చేసేందుకు పెట్టినదని ఆరోపించారు. అలాగే ఎప్‌‌స్టీన్ ఫైల్స్‌ విషయంలోనూ మోదీ ఒత్తిడిలో ఉన్నారన్నారు. ఇందులో ఎన్నో కీలక విషయాలు ఉన్నాయని.. వాటిని ఇంకా US రిలీజ్ చేయలేదని చెప్పుకొచ్చారు. ఇందుకే ప్రధాని భయంతో ఉన్నారని ఆరోపించారు.

News February 3, 2026

8 మంది ఎంపీల సస్పెన్షన్.. లోక్‌సభ రేపటికి వాయిదా

image

విపక్ష ఎంపీల ఆందోళనల నేపథ్యంలో లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. తనపై పేపర్లు విసిరిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్‌ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. సెషన్‌ మొత్తం వారిపై సస్పెన్షన్ అమల్లో ఉండనుంది. వీరిలో తెలంగాణ ఎంపీ చామల కిరణ్ కుమార్‌తోపాటు హిడీ ఈబెన్, అమరీందర్ సింగ్, రాజా వారింగ్, మాణికం ఠాగూర్, గుర్జీత్ సింగ్ ఉన్నారు.