News January 22, 2025

సిద్దిపేట: బేటీ బచావో బేటీ పఢావో పోస్టర్ ఆవిష్కరణ

image

సిద్దిపేట జిల్లాలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పఢావో కార్యక్రమం నిర్వహించారు. 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కలెక్టర్ చాంబర్లో “బేటీ బచావో బేటీ పఢావో” పోస్టర్స్‌ని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి ఆవిష్కరించారు. ఈనెల 22 నుంచి మార్చి 8, 2025 మహిళా దినోత్సవం నాటి వరకు ఆడపిల్లల ప్రాముఖ్యతను కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.

Similar News

News November 9, 2025

NLG: చేతిలో పైసల్లేవ్.. కష్టంగా కుటుంబ పోషణ!

image

నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న తమకు వేతనాలు సకాలంలో అందడం లేదని కాంట్రాక్టు ఉద్యోగులు తెలిపారు. ఏజెన్సీల మధ్య ఉద్యోగులు నలిగిపోతున్నామన్నారు. 7 నెలలుగా జీతాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారన్నారు. ఆస్పత్రి అధికారులు కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతున్నారన్నారు. జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. చేతిలో పైసల్లేకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందన్నారు.

News November 9, 2025

కాకినాడలో రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

image

కాకినాడ జిల్లాలో ఈ నెల 10న యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ షాన్ మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటల నుంచి 1 వరకు కాకినాడ కలెక్టరేట్‌లో జరుగుతుందన్నారు. అధికారులు విధిగా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని, అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు.

News November 9, 2025

విశాఖ కలెక్టరేట్‌లో రేపు జరగబోయే PGRS రద్దు

image

విశాఖ కలెక్టరేట్‌లో రేపు జరగబోయే పీజీఆర్ఎస్‌ను రద్దు చేసినట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం CII పార్ట్‌నర్ షిప్ సమ్మిట్ ఏర్పాట్లలో ఉన్నందున PGRSను తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ కోరారు. నవంబర్ 17వ తేదీన PGRS యథావిధిగా నిర్వహిస్తామని చెప్పారు.