News January 22, 2025

వచ్చే నెల 19 నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు

image

శ్రీశైల మహాక్షేత్రంలో వచ్చే నెల 19వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శివరాత్రి బ్రహ్మోత్సవాలపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అందరి సమష్టి కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని సమావేశంలో తీర్మానించారు.

Similar News

News February 28, 2026

మద్దూర్ నగర్‌లో పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్

image

మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలులోని మద్దూర్ నగర్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను కలెక్టర్ స్వయంగా పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి నగదు అందజేస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెలా సరైన సమయానికి పింఛన్ అందుతుందా అని లబ్ధిదారులను అడిగారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.

News February 28, 2026

ప్రభుత్వ పథకాల ప్రచారాన్ని విస్తరించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేలా సమర్థవంతంగా ప్రచారం చేయాలని కర్నూలు కలెక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. సమాచార శాఖ రూపొందించిన ‘స్వర్ణాంధ్ర@2047’ క్యాలెండర్‌ను కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. జిల్లాలో జీడీపీ, తలసరి ఆదాయం పెంచేందుకు శాఖలు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని, వ్యవసాయం, పశుసంవర్థకం, డ్రిప్ ఇరిగేషన్ రంగాల్లో రైతుల ఆదాయం పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

News February 27, 2026

358 మంది విద్యార్థుల గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 358 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి (RIO) లాలప్ప తెలిపారు. మొత్తం 5,069 మంది విద్యార్థులకు గానూ 4,711 మంది పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, పరీక్షలు అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిశాయని ఆయన పేర్కొన్నారు.