News January 22, 2025

VZM: కానిస్టేబుల్ అభ్యర్థి మృతి

image

దత్తిరాజేరు మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ అభ్యర్థి బౌడుపల్లి రవి కుమార్ (22) బుధవారం మృతి చెందినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జనవరి 21న విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండులో నిర్వహించిన పీఈటీ పరీక్షలకు రవి హాజరయినట్లు చెప్పారు. 1,600 మీటర్ల పరుగులో పాల్గొని అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడని, విశాఖలోని ఓ అసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

Similar News

News February 24, 2026

భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల భూసేకరణను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమీక్షలో తారకరామ తీర్థసాగర్, తోటపల్లి, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, తదితర పనుల పురోగతిని సమీక్షించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ రహదారి, కాలువలు, ఎస్టీపీలు, ఒబేరాయ్ హోటల్‌కు సంబంధించిన భూసేకరణను గడువులోగా పూర్తి చేయాలన్నారు.

News February 24, 2026

చీపురుపల్లిలో సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే

image

సీఎం చంద్రబాబు ఈనెల 28న విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం 28న ఉదయం 11 గంటలకు చీపురుపల్లి మండలం రావివలసకు హెలికాప్టర్‌లో చేరుకుంటారు. 11.20 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావేదిక మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం 1.40 నుంచి 2.25 వరకూ పైలపేటలోని లబ్ధిదారులను కలుస్తారు. 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రావివలసలో జరిగే కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం తిరుగుపయనమౌతారు.

News February 24, 2026

VZM: ఈరోజు పరీక్షకు 515 మంది గైర్హాజరు

image

విజయనగరం జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షను 19,483 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 18,968 మంది హాజరయ్యారని రీజనల్ ఇన్‌స్పెక్టర్ తవిటినాయుడు తెలిపారు. మొత్తం 515 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లాలో 66 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 100 మంది ఇన్విజిలేటర్లు, 3 సిట్టింగ్ స్క్వాడ్లు, 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు నియమించారు. జిల్లాలో ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని చెప్పారు.