News March 18, 2024
నెల్లూరులో 7 సమస్యాత్మక కేంద్రాలు

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 32,746 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో 28,080 మంది రెగ్యులర్, 4,666 మంది ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 7 సమస్యాత్మక కేంద్రాలు(సీతారామపురం, నారాయణ రెడ్డిపేట, కలువాయి ఏ, బీ సెంటర్లు, సౌత్ మోపూరు, మర్రిపాడు, రేవూరు) గుర్తించారు. వీటిలో 4 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Similar News
News January 2, 2026
నెల్లూరు: కన్నీరు ఇంకి.. గుండెలు తడారి

భర్తను కోల్పోయిన భార్య.. కొడుకు దూరమై తల్లి, తండ్రి తిరిగి రాని లోకాలకు వెళ్లాడని అర్థం కాని అభం శుభం తెలియని చిన్నారులు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయి ఆ కుటుంబం భవిష్యత్తు అంధకారమైంది. కన్నీళ్లు ఇంకిపోయిన వారి దీనస్థితి వర్ణణాతీతం. బిడ్డల్ని ఎలా సాకాలో అర్థం కాక ఆ తల్లి మూగగా రోదిస్తోంది. అనారోగ్యంతో సైదాపురంలో ఇవాళ మృతి చెందిన నాగారాజు ఇంట్లో కనిపించిన ఈ విషాద దృశ్యం గుండెల్ని మెలిపెట్టక మానదు.
News January 1, 2026
నెల్లూరు: మొదలైన కోడి పందేలు..

మరో రెండు వారాల్లో సంక్రాంతి రాబోతుంది. గ్రామాల్లో ఇప్పటికే సందడి మొదలైంది. ఈ క్రమంలో పందెం రాయుళ్లు సై అంటున్నారు. కొండాపురం(M) తూర్పుయర్రబల్లి శివారులో నాలుగు రోజులుగా కోడి పందేలు జరగుతున్నట్లు తెలుస్తోంది. పక్కల జిల్లాల నుంచి పలువురు వస్తున్నారట. రూ.లక్షలో చేతులు మారుతున్నట్లు సమాచారం. దీనిపై అధికారులు ఏం అంటారో చూడాలి.
News January 1, 2026
నెల్లూరోళ్లు ఎన్ని ఫోన్లు పోగొట్టుకున్నారో తెలుసా..?

నెల్లూరు జిల్లాలో 2025 ఏడాదిలో చోరీకి గురైన ఫోన్ల ఖరీదు చూస్తే ముక్కున వేలు వేసుకుంటారు. ఒక్క ఏడాదిలోనే ప్రజలు 1140 మొబైల్స్ పోగొట్టుకున్నారు. వీటి విలువ రూ.2.28కోట్లు అని అధికారులు వెల్లడించారు. మన పోలీసులు ఈ ఏడాదిలో వీటిని రికవరీ చేసి బాధితులకు అందజేశారు. దీన్ని బట్టి చూస్తే.. జిల్లాలో కాస్త ఆదమరిచినా మీ జేబులోని ఫోన్ పోవడం ఖాయం.


