News January 22, 2025

సీరోల్: ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

సీరోల్ మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సంతోష్ సోని ప్రకటనలో తెలిపారు. 6వ తరగతిలో బాలికలు 30, బాలురు 30 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఫిబ్రవరి 16 లోపు https://tsemrs.telangana.gov.in/schoolDet.php?s=EMRS%20Seerole వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.

Similar News

News January 20, 2026

మద్దికెర, చిప్పగిరి మండలాలకు అభివృద్ధి నిధులు

image

నీతి ఆయోగ్ యాస్పిరేషనల్ బ్లాక్‌గా ఎంపికైన మద్దికెర మండలంలో రూ.కోటి అభివృద్ధి పనులకు ఆమోదం లభించిందని కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. అంగన్వాడీలు, హెల్త్ క్లినిక్‌లు, ఆర్వో ప్లాంట్లు, మినీ ట్యాంకుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయన్నారు. చిప్పగిరి మండలంలో రూ.1.50 కోట్ల పనులకు అనుమతులు వచ్చాయని చెప్పారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News January 20, 2026

ఏప్రిల్ 20న సింహాచలం చందనోత్సవం

image

సింహాచలంలో ఏప్రిల్ 20న జరగనున్న లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం ఏర్పాట్లపై ప్రాథమిక సమీక్ష జరిగింది. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మంగళవారం విశాఖ కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జేసీ, సీపీ, జీవీఎంసీ కమిషనర్, దేవస్థానం ఈవో ఉన్నారు.

News January 20, 2026

తొలి EV ‘అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా’ ఆవిష్కరించిన టయోటా

image

భారత్‌లో టయోటా తన మొదటి EV ‘అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా’ కారును ఆవిష్కరించింది. LED డీఆర్‌ఎల్స్, ఆకర్షణీయమైన హెడ్ లాంప్స్, డిఫరెంట్ ఫ్రంట్ బంపర్ అమర్చారు. ఇంటీరియర్‌లో సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, పవర్డ్ డ్రైవర్ సీట్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి. 61kWh బ్యాటరీ వేరియంట్ 543KM, 49kWh వేరియంట్ 440KM మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ కారు ధరను ఇప్పటి వరకు ప్రకటించలేదు.