News January 22, 2025

జోగులాంబ: కార్మికుల పోరాటం వల్లే ధరల పెరుగుదల: సీఐటీయూ

image

జోగులాంబ: కార్మిక సంఘాల పోరాటాల ఫలితానికి ప్రభుత్వం సివిల్ సప్లై హమాలీలకు రేట్లు పెంచారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి అన్నారు. జిల్లా కేంద్రంలో సీఐటీయూ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయన హాజరయ్యారు. వారం రోజులపాటు జిల్లా కేంద్రంలో కార్మికులు రిలే దీక్ష చేయడంతో ప్రభుత్వం ధరలను పెంచిందని ఆయన అన్నారు. ఆయన వెంట ఉప్పేరు నరసింహ ఉన్నారు.

Similar News

News February 23, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

➤పలాస:గూడ్స్ రైలుకు తప్పిన పెనుప్రమాదం
➤శ్రీకాకుళంలో ప్రబలిన డయేరియా
➤శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్ కు 51 వినతులు
➤ఇచ్ఛాపురం: ఏసీబీ వలలో ఎంఈఓ
➤జిల్లాలో పలుచోట్ల అంగన్వాడీల నిరసన
➤శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షకు 662 మంది గైర్హాజరు
➤టెక్కలి: ఆటో-బైక్ ఢీ..ఆరుగురికి గాయాలు
➤జిల్లా వ్యాప్తంగా ఎర్రన్నాయుడు జయంతి కార్యక్రమాలు

News February 23, 2026

ఉపాధి హామీ బిల్లుల అప్లోడ్‌పై కలెక్టర్ కఠిన ఆదేశాలు

image

ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ ఎక్స్పెండేచర్ బిల్లులను ప్రత్యేక దృష్టితో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులకు ఆదేశించారు. నమోదు చేయాల్సిన రూ.131 కోట్లలో ఇప్పటివరకు రూ.86.87 కోట్లు మాత్రమే నమోదు అయ్యాయని, మిగిలిన రూ.44.48 కోట్ల బిల్లులను మార్చి 10 లోపు పూర్తి చేయాలన్నారు. ఏ బిల్లు 24 గంటలకు మించి పెండింగ్ ఉండకూడదని స్పష్టం చేశారు. సంబంధిత శాఖలు లక్ష్యాలు సాధించాలన్నారు.

News February 23, 2026

NZB: రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్‌లో హరీశ్ తేజకు సిల్వర్ మెడల్

image

తెలంగాణ రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన హరీశ్ తేజ సిల్వర్ మెడల్ సాధించాడు. హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన సీఎం కప్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 65 కేజీల కేటగిరిలో హరీశ్ తేజ కోచ్ రాజ్ కుమార్ సహకారంతో స్నాచ్‌లో 96, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కేజీల బరువెత్తి మొత్తం 207 కేజీల బరువుతో ద్వితీయ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ అందుకున్నాడు.