News March 18, 2024
SSCలో 4,187 ఎస్ఐ కొలువులు

ఖాళీగా ఉన్న 4,187 ఎస్ఐ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు SSC నోటిఫికేషన్ విడుదల చేసింది. BSF, CISF, CRPF, ITBP వంటి విభాగాల్లో వీటిని భర్తీ చేయనున్నారు. ఆగస్ట్ 1, 2024 నాటికి డిగ్రీ పాసై 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు అందుతుంది. పేపర్ 1, పేపర్ 2, ఫిజికల్ టెస్టులు ఉంటాయి. మే 9, 10, 13 తేదీల్లో పరీక్షలు ఉంటాయి. ఈ నెల 28లోగా https://ssc.inలో దరఖాస్తు చేసుకోవాలి.
Similar News
News March 31, 2025
సీఎస్కేపై సెహ్వాగ్ విమర్శలు

రాజస్థాన్‌తో సీఎస్కే ఓటమి అనంతరం మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆ జట్టుపై విమర్శలు గుప్పించారు. ‘క్రీజులో ఎంత పేరున్న ఆటగాడున్నా 2 ఓవర్లలో 40 పరుగులు చేయడమనేది కష్టమైనపని. ఏదో ఒకట్రెండు సార్లు మాత్రమే అది సాధ్యం. అక్షర్, పఠాన్ బౌలింగ్‌లో ధోనీ అప్పుడెప్పుడో 2సార్లు ఛేజ్ చేశారు. అలాంటివి తరచూ జరగవు. నాకు తెలిసి గడచిన ఐదేళ్లలో సీఎస్కే 180కి పైగా పరుగుల్ని ఎప్పుడూ ఛేదించలేదు’ అని పేర్కొన్నారు.
News March 31, 2025
SRHకు వేధింపులు.. సీఎం ఆగ్రహం

TG: పాసుల కోసం SRH యాజమాన్యాన్ని HCA <<15934651>>వేధింపులకు<<>> గురిచేసిన వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వివరాలను సేకరించిన ఆయన దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దర్యాప్తు తర్వాత కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు.
News March 31, 2025
ఆ 400 ఎకరాలపై సర్వే జరగలేదు: హెచ్‌సీయూ

TG: గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి తమదేనని TGIIC <<15947111>>ప్రకటించడాన్ని<<>> హెచ్‌సీయూ ఖండించింది. 2024 జులైలో వర్సిటీ ప్రాంగణంలో సర్వే జరగలేదని, పరిశీలన మాత్రమే చేశారని పేర్కొంది. భూముల హద్దుల నిర్ణయానికి తాము అంగీకరించలేదని తెలిపింది. ఈ ప్రాంతంలోని పర్యావరణం, జీవవైవిధ్యాన్ని కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వర్సిటీకి కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం ఉండాలంది.