News January 22, 2025

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. MSP పెంపు

image

జనపనార (జూట్) రైతులకు మోదీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. 2025-26 సీజన్‌కు గాను కనీస మద్దతు ధర (MSP)ను 6% అంటే క్వింటాకు రూ.315 మేర పెంచి రూ.5,650కి చేర్చింది. దీంతో దేశవ్యాప్తంగా జూట్ ఉత్పత్తిపై సగటు ఖర్చు కన్నా రైతుకు 66% ఎక్కువ రాబడి లభిస్తుంది. 2014-15లో రూ.2400గా ఉన్న క్వింటా ధరను కేంద్రం పదేళ్లలో 235 శాతానికి పెంచడం గమనార్హం. దేశవ్యాప్తంగా 40 లక్షల రైతు కుటుంబాలు జనపనార సాగు చేస్తున్నాయి.

Similar News

News January 23, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News January 23, 2025

సైఫ్‌ను కాపాడిన ఆటో డ్రైవర్‌కు ₹లక్ష ఇస్తా: సింగర్

image

సైఫ్ అలీఖాన్‌ను ఆస్పత్రికి తరలించిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్‌ను బాలీవుడ్ సింగర్ మికా సింగ్ ప్రశంసించారు. ఫేవరెట్ సూపర్ స్టార్‌ను కాపాడిన ఆటో డ్రైవర్‌కు కనీసం రూ.11 లక్షల రివార్డ్ అయినా ఇవ్వాలి. ఆయన వివరాలు చెప్పండి. నా తరఫున రూ.లక్ష ఇవ్వాలనుకుంటున్నా’ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కాగా ఇవాళ ఆటో డ్రైవర్‌ను సైఫ్ కలిసి కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే.

News January 23, 2025

దావోస్‌లో అందరం ఒక్కటే: సీఎం చంద్రబాబు

image

చరిత్రలో మొదటిసారి భారత్ తరఫున అందరం కలిసి మాట్లాడుతున్నామని AP సీఎం చంద్రబాబు అన్నారు. ‘భారత్ నుంచి పలు పార్టీలు వచ్చినా దావోస్‌లో అందరం ఒక్కటే. గతంలో ఒకరిద్దరు సీఎంలు, కేంద్రమంత్రులు వచ్చేవారు. భారత్ ఇక నుంచి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఏపీ సుస్థిరాభివృద్ధికి చాలా కష్టపడాలి’ అని దావో‌స్ ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు అన్నారు. ఇందులో భారత్ నుంచి వెళ్లిన వివిధ రాష్ట్రాల నేతలు పాల్గొన్నారు.