News January 22, 2025
సంగారెడ్డి: ఉగాది తర్వాత రైతు భరోసా ఇస్తామనడం సరికాదు: ఎమ్మెల్యే

ఉగాది పండుగ తర్వాత రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం చెప్పడం సరికాదని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని చెప్పారు. రైతులను మోసం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ సమావేశంలో కాసాల బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.
Similar News
News September 18, 2025
ఆసిఫాబాద్: పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య

పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నెహ్రూ నగర్‌కు చెందిన మాచర్ల రమేశ్ మొక్కజొన్న పంటను బుధవారం అడవి పందులు ధ్వంసం చేశాయి. కలత చెందిన రైతు అదే రోజు తన పంట చేనులోనే పురుగు మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతడిని రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు.
News September 18, 2025
VKB: దత్త పీఠాన్ని దర్శించుకున్న స్పీకర్

దత్తాత్రేయుడి కటాక్షంతో ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. గురువారం దుండిగల్‌లోని దత్త పీఠాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక, దైవచింతన అలవర్చుకుంటే చక్కటి జీవితం సాధ్యపడుతుందని పేర్కొన్నారు.
News September 18, 2025
ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళికలు సిద్ధం చేయాలి: కలెక్టర్

వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు పటిష్ఠ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. 2025-26లో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా 260 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రైతులు నాణ్యత ప్రమాణాలతో ధాన్యం తెచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సన్న, దొడ్డు రకాలను వేరువేరుగా నిలువ చేయాలన్నారు.