News January 22, 2025
పెద్దపల్లి: కాంట్రాక్ట్ ప్రాతిపదికన గైనకాలజిస్ట్ పోస్టులకు ఆహ్వానం

కాంట్రాక్ట్ గైనకాలజిస్ట్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంథని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు ఖాళీగా ఉన్న గైనకాలజిస్ట్ పోస్టును కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులను బయోడేటా తో పాటు జిల్లా ఆసుపత్రి నందు అందించాలని వివరాలకు 8499061999 నెంబర్‌ను సంప్రదించాలని డీసీహెచ్వో ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Similar News
News January 7, 2026
నరసరావుపేట: 50 ఏళ్ల తర్వాత తెప్పోత్సవం.. పరిశీలించిన ఆర్డీవో

నరసరావుపేటలోని వల్లప్ప చెరువులో సంక్రాంతి సందర్భంగా ఈనెల 14న గంగా పార్వతీ సమేత భీమలింగేశ్వర స్వామి తెప్పోత్సవం నిర్వహించనున్నారు. 50 ఏళ్ల క్రితం నిలిచిపోయిన ఈ ఉత్సవాన్ని పునఃప్రారంభిస్తున్న నేపథ్యంలో ఆర్డీవో మధులత ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చారిత్రక ప్రాధాన్యమున్న ఈ వేడుక మళ్లీ మొదలుకావడంపై పట్టణ ప్రజల్లో పండుగ వాతావరణం నెలకొంది.
News January 7, 2026
మెుక్కజొన్నలో కత్తెర పురుగు కట్టడికి సహజ కషాయం

మొక్కజొన్న పంటను ఆశించే కత్తెర పురుగు, పచ్చ పురుగు, లద్దె పురుగుల నిర్మూలనకు సహజ కషాయాన్ని రూపొందించారు కృష్ణా జిల్లాకు చెందిన రైతు శివకృష్ణ. 200 లీటర్ల నీటిలో కిలో సర్ప్, అర కిలో పసుపును వేసి బాగా కలపాలి. అది బాగా మిక్స్ అయ్యాక ఉదయం లేదా సాయంత్రం వేళ చల్లగా ఉన్నప్పుడు వాటర్ బాటిల్‌కు రంద్రం చేసి మొక్కజొన్న మొక్క మొవ్వులో ఈ ద్రావణం వేయాలి. 25 రోజుల వయసున్న పైరులో మాత్రమే ఈ ద్రావణాన్ని వాడాలి.
News January 7, 2026
T20 WCకు న్యూజిలాండ్ జట్టు ప్రకటన

వచ్చే నెల భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న T20 వరల్డ్ కప్‌కు న్యూజిలాండ్ 15 మందితో జట్టును ప్రకటించింది. శాంట్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
జట్టు: శాంట్నర్(C), ఫిన్ అలెన్, బ్రేస్‌వెల్, చాప్‌మన్, కాన్వే, డఫీ, ఫెర్గూసన్, హెన్రీ, మిల్నే, మిచెల్, నీషమ్, ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, సీఫర్ట్, సోధి.
– మరోవైపు ఈ నెల 11 నుంచి భారత్‌తో న్యూజిలాండ్ 3 వన్డేలు, 5 T20ల సిరీస్‌లు ఆడేందుకు ఇండియా రానుంది.


