News January 22, 2025

దారుణం.. భార్యను ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడికించాడు!

image

హైదరాబాద్ మీర్‌పేట్‌లో వెంకట మాధవి (35) అనే మహిళ హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి. ఆమెపై అనుమానంతో భర్త గురుమూర్తే చంపి, మృతదేహాన్ని ముక్కలుగా చేసినట్లు దర్యాప్తులో తేలింది. వాటిని కుక్కర్‌లో ఉడికించి, ఆ తర్వాత జిల్లెలగూడ చెరువులో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈనెల 18 నుంచి మాధవి కనిపించకుండా పోయింది. ఆమె తల్లిదండ్రులతో కలిసి భర్త కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

Similar News

News January 23, 2025

మ్యాచ్ టికెట్ ఉంటే.. మెట్రోలో ఉచిత ప్రయాణం

image

భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో T20 ఈ నెల 25న చెన్నైలో జరగనుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ టికెట్ ఉన్న వారికి మెట్రోలో ఫ్రీగా ప్రయాణించే అవకాశం కల్పించింది. చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరగనుండగా.. స్టేడియానికి రావడానికి, వెళ్లడానికి మెట్రోలో టికెట్ అవసరం లేదని స్పష్టం చేసింది. 2023 ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలోనూ TNCA ఇలా మెట్రో టికెట్ ఫ్రీ ఆఫర్ కల్పించింది.

News January 23, 2025

రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథి ఈయనే..

image

2025 గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో రానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జనవరి 26 రిపబ్లిక్ డే పరేడ్‌లో ఇండోనేషియాకు చెందిన 160మందితో కూడిన కవాతు, 190 మంది సభ్యుల బ్యాండ్ బృందాలు భారత సైనికులతో కలిసి కవాతు నిర్వహించనున్నాయి. 1950 నుంచి భారత్ తన మిత్ర దేశాల అధినేతలను వేడుకలకు ఆహ్వానిస్తోంది. గతేడాది ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మెక్రాన్ హాజరైన విషయం తెలిసిందే.

News January 23, 2025

రూ.173కు కొని.. రూ.43 కోట్లకు అమ్మాడు!

image

ఇంట్లో పాత వస్తువులుంటే మనం చెత్తబుట్టలో పడేస్తాం. కానీ, అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఆ పాత వస్తువు అమ్మి కోటీశ్వరుడయ్యాడు. పాత వస్తువులను కలెక్ట్ చేసే అలవాటున్న ఓ వ్యక్తి 2010లో ఓ షాపుకెళ్లి $2 (రూ. 173) చెల్లించి పాత ఫొటోను కొన్నాడు. అయితే, ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి అమెరికన్ చరిత్రలో చాలా ప్రసిద్ధి చెందినవారని తెలుసుకున్నాడు. ఈక్రమంలో 2014లో దీనిని వేలం వేసి $5 మిలియన్లకు(రూ.43కోట్లు) విక్రయించాడు.