News January 22, 2025
ములుగు: మైనారిటీ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

ములుగు జిల్లాలోని మైనారిటీ నిరుద్యోగ అభ్యర్థుల నుంచి గ్రూప్- 1,2,3,4, రైల్వే బ్యాంకింగ్ పోటీ పరీక్షలకు సంబంధించి 4 నెలల ఫౌండేషన్ కోర్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. అర్హులైన మైనారిటీ నిరుద్యోగ అభ్యర్థులు ఫిబ్రవరి 15లోగా జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్లో గల రూమ్ నంబర్ 6లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
Similar News
News January 13, 2026
చర్మం పొడిబారి రాలుతోందా?

శీతాకాలం మొదలైతే చాలు చర్మం పొడిబారడం, ఎండిపోయి జీవం కోల్పోయినట్టుగా ఉండటం చాలామందిలో కనిపించే సమస్య. చర్మం బాగా పగిలిపోతే కలబంద రాయాలి. ఇది చర్మానికి చల్లదనం ఇవ్వడమే కాదు.. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు దురద, నొప్పిని తగ్గిస్తాయి. ఆలివ్ నూనె సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. కొబ్బరి, జొజోబా నూనెలను సమపాళ్లలో తీసుకొని దానికి కొన్నిచుక్కల టీట్రీ ఆయిల్ కలిపి చర్మానికి రాయాలి.
News January 13, 2026
సంగారెడ్డి: GREAT.. జిల్లా వాసికి ప్రిడ్ భారతరత్న అవార్డ్

HYD రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన వినాయక్ పవర్‌కు ప్రతిష్టాత్మక ప్రిడ్ భారతరత్న అవార్డు-2026 లభించింది. వల్లూరి ఫౌండేషన్, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ అవార్డును అందజేశారు. 2020-2025 మధ్య ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా జాతీయ మానవ హక్కుల కమిటీ ఛైర్మన్‌గా ఆయన అందిస్తున్న సేవలను పలువురు ప్రశంసించారు.
News January 13, 2026
‘జిగురు అట్టల’తో రసంపీల్చే పురుగుల ఆటకట్టు

పంటలకు హానిచేసే రసం పీల్చే పురుగుల కట్టడిలో జిగురు అట్టలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ అట్టల ఉపరితలంపై జిగురు ఉంటుంది. వాటిపై వాలే పురుగులు జిగురుకు అంటుకుపోయి మరణిస్తాయి. పసుపు రంగు జిగురు అట్టలు తెల్లదోమ, పచ్చదోమ, వివిధ రకాల ఈగలను.. తెలుపు అట్టలు నల్ల తామర, ఎర్ర నల్లి, బ్లాక్ త్రిప్స్.. నీలిరంగు అట్టలు తామర పురుగులు, పేనుబంక, మిడతలను ఆకర్షిస్తాయి. ఈ అట్టలపై వాలగానే ఆ పురుగులు అతుక్కుని చనిపోతాయి.


